పెళ్లి ఒత్తిడితోనే పారిపోయా.. | Student Missing Case happy Ending in Chittoor | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగింత

Published Wed, Feb 13 2019 12:12 PM | Last Updated on Wed, Feb 13 2019 12:12 PM

Student Missing Case happy Ending in Chittoor - Sakshi

విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న మండల మెజిస్ట్రేట్‌ కులశేఖర్‌

చిత్తూరు , కలికిరి: వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (17) అదృశ్యం కేసు సుఖాంతమైంది. కలికిరి మండలం తుమ్మలపేట లోని తన అమ్మవారి ఇంటికి వచ్చి ఈ నెల రెండో తేదీన ఆమె అదృశ్యమైన విషయం విదితమే. మూడు రోజుల పాటు వెతికిన ఆమె తల్లిదండ్రులు 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థిని వైఎస్సార్‌ జిల్లా కడపలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులతో సహా మంగళవారం కలికిరి మండల మెజిస్ట్రేట్‌ కులశేఖర్‌ ముందు హాజరుపరిచారు. తల్లిదండ్రులు వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి చేయడంతోనే ఇంటి నుంచి అదృశ్యమైనట్లు సదరు యువతి అధికారులకు వెల్లడించింది. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, విద్యార్థినిని చదివించాలని ఆదేశించారు. అనంతరం పోలీసుల సమక్షంలో విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement