
సాక్షి, తిరుపతి: తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతోన్న శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాల భక్తుల రద్దీని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న తమిళ స్మగ్లర్ల వ్యూహం బెడిసికొట్టింది. గురువారం భక్తుల ముసుగులో ఎర్ర చందనం ఉన్న వాహనానికి పూజలు చేయించి తిరుమల నుంచి తమిళనాడుకు బయలు దేరారు. ఈ క్రమంలో మార్గంమధ్యలో.. అలిపిరి చెక్ పాయింట్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికి పోయారు. పోలీసులు నలుగురు తమిళ స్మగ్లర్లతో పాటు వాహనాన్ని సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎర్రకూలీలు పట్టుబడిన వాహనంలో ఎర్ర చందనాన్ని గతంలో ఐదుసార్లు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment