
నాటు సారాతో పట్టుబడ్డ టీడీపీ నాయకుడు బీలునాయక్
సుండుపల్లి : మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ రాగిమానుబిడికిలో సారాను విక్రయిస్తున్న టీడీపీ జిల్లా నాయకుడు బీలు నాయక్‌ను రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ నరసింహారెడ్డి అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. సోమవారం నాకాబందిలో భాగంగా రాగిమానుబిడికి గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బీలునాయక్ ఇంటిలో నాటు సారా నిల్వ ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బీలునాయక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జోసెఫ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment