natu sara
-
చంద్రన్న నాటుసారా.. కుప్పంలో కొత్త లిక్కర్
-
సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్ ఆర్ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాటుసారాకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం
నెల్లూరు(క్రైమ్): నాటు సారారహిత గ్రామాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్–2 జిల్లాలో విజయవంతమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి రెండునెలలపాటు ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జేడీ కె.శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సారా తయారీ, విక్రయ, అక్రమరవాణా అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఆయా ప్రాంతాల్లో సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మరోవైపు కార్డన్ సెర్చ్‌లు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా నిర్మూలనతోపాటు వ్యాపారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సారాకు బానిసలు కావొద్దని యువతకు సూచించారు. తమ ప్రాంతాల్లో సారా తయారీకి ఒప్పుకోమని గ్రామస్తులతో ప్రమాణాలు చేయించారు. సారా వ్యాపారం మానుకున్న వారికి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని ఇచ్చిన హామీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 81 కేసులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి 79 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 238 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 23 వేల లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. 75 కేజీల బెల్లం, రెండు వాహనాలను సీజ్ చేశారు. కొందరు సారా తయారీదారులకు బెల్లం సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారిపై పీడీ యాక్ట్ తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన సముద్రాల దుర్గారావు, మేకల హరీష్‌పై పీడీ యాక్ట్ పెట్టి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. ఉక్కుపాదం మోపాం ఆపరేషన్ పరివర్తన్–2లో భాగంగా సారా తయారీ, విక్రయాలపై రెండునెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. నిందితులపై కేసులు నమోదుచేయడంతోపాటు తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేశాం. ఆత్మకూరు ఉప ఎన్నిక పూర్తయింతే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మత్తు పదార్థాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాం. ఈ తరహా నేరాలు జరుగుతన్నట్లు ప్రజలు గుర్తిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులు, సెబ్ «అధికారులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – శ్రీలక్ష్మి, సెబ్ జేడీ -
నాటుసారా కేసులో సంచలన తీర్పు
కాకినాడ లీగల్: నాటుసారా విక్రయిస్తున్న మహిళకు రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎం.మాధవి శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు. ఇప్పటివరకు సారా కేసుల్లో నెలల వ్యవధిలోనే జైలు శిక్షలు, వేల రూపాయల్లోనే జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చేవారు. మొట్టమొదటిసారిగా భారీగా జరిమానాతోపాటు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ గొడారిగుంట కొండేలుపేటకు చెందిన చోడిపల్లి బంగారమ్మ 2020లో జి–కన్వెన్షన్ హాలు ప్రాంతంలో సారా విక్రయిస్తున్న ఆమెను పోలీసులు పట్టుకుని 10 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బంగారమ్మపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చదవండి👉బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు: ఉన్మాదికి ఉరి -
సారా కేసులో తెలుగు యువత నేత అరెస్ట్
కర్నూలు: సారా విక్రయిస్తూ తెలుగు యువత కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో ఆయనపై 8 మట్కా నిర్వహణ కేసులు కూడా ఉన్నాయి. మట్కా డాన్ సయ్యద్ అసదుల్లా కుమారుడైన అబ్బాస్.. టీజీ భరత్‌కు అనుచరుడు. అబ్బాస్ సోదరులు సయ్యద్ నూరిపైన 10, అన్వర్‌పై 12 సారా, మట్కా కేసులున్నాయి. తండ్రి అసదుల్లాపై 40కు పైగా మట్కా కేసులున్నాయి. గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటి వద్ద సారా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా వేసి అసదుల్లాతో పాటు అబ్బాస్, అన్వర్, సయ్యద్నూరిలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు పంపారు. -
సారా మరణం కాదు.. అనారోగ్యంతో చనిపోయాడు
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లాలో సహజ మరణాలను నాటు సారా మరణాలంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మరోసారి రూఢి అయింది. మొన్న జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ మరణాన్ని సారా మరణంగా చిత్రీకరించి టీడీపీ నానా హంగామా చేసింది. అయితే, తమ తండ్రికి అసలు మద్యం అలవాటే లేదంటూ సత్యనారాయణ కుమారుడు, కుమార్తె స్పష్టంగా చెప్పడంతో పచ్చ బ్యాచ్ ఖంగుతింది. ఇప్పుడు ఉండి మండలం ఉణుదుర్రుకు చెందిన బొంతు అప్పారావు మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అప్పారావు నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొన్ని పత్రికల్లో వచ్చిన ఈ కథనాలపై రెవెన్యూ అధికారులు అప్పారావు కుటుంబీకులను విచారించగా, అదంతా ఉత్తి అబద్ధమేనని తేలింది. అప్పారావు అనారోగ్యంతో చనిపోయాడని తేటతెల్లమైంది. గురువారం ఉణుదుర్రుకు వెళ్లి అప్పారావు భార్య పర్లమ్మ, కుమారుడు అప్పన్నతో మాట్లాడినట్లు డిప్యూటీ తహసీల్దార్ వీరాస్వామినాయుడు చెప్పారు. ఈ నెల 2న అప్పారావు, మరికొందరు మినప కోతలకు గుడివాడ వద్దనున్న పతిపర్రు వెళ్లారన్నారు. 11న అప్పారావు కడుపునొప్పితో గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, అయినా తగ్గకపోవడంతో 12వ తేదీ ఉదయానికి ఉణుదుర్రుకు వచ్చాడని తెలిపారు. అదేరోజు అప్పారావును తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 12వ తేదీ రాత్రి 8 గంటలకు ఏలూరుకు తరలించారన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించినా అప్పటికే అప్పారావు ఆరోగ్యం విషమించడంతో రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు. కుటుంబీకుల వద్ద తీసుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. నా తండ్రి అనారోగ్యంతో మరణించాడు బొంతు అప్పారావు అనారోగ్యంతోనే చనిపోయాడని ఆయన కుమారుడు అప్పన్న చెప్పారు. తన తండ్రి నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ‘నా తండ్రి మినప కోతలకు వెళ్ళి అనారోగ్యం పాలయ్యాడే తప్ప నాటుసారా తాగి కాదు. ఆయన, గ్రామానికి చెందిన మరికొందరు ఈ నెల 2న గుడివాడ వద్ద గల పతిపర్రుకు మినప కోతలకు వెళ్ళారు. ఈ నెల 11న నాన్నకు యూరిన్ బ్లాడర్ సమస్యతో కడుపునొప్పి వచ్చిందని అక్కడ వైద్యం చేయించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మా గ్రామస్తుని సహకారంతో 11వ తేదీ రాత్రి బయల్దేరి 12వ తేదీ ఉదయానికి ఇంటికి వచ్చారు. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. యూరిన్ పూర్తిగా బంద్ కావడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకువెళ్లాం. అయితే చికిత్స పొందుతూ వెళ్లిన కొద్దిసేపటికే మా నాన్న చనిపోయారు. ఆయన మరణాన్ని ఇలా రాజకీయం చేసి మమ్మల్ని అల్లరిపాలు చేయడం చాలా బాధగా ఉంది’ అని అప్పన్న చెప్పారు. – బొంతు అప్పారావు కుమారుడు అప్పన్న -
సారాయి సాధ్యమేనా?
ఏమైనా లాజిక్ ఉందా...? నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతం.. పోలీస్‌స్టేషన్‌తో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలున్న జంగారెడ్డిగూడెం లాంటి చోట అందరి కళ్లుగప్పి నాటు సారా తయారీ సాధ్యమయ్యే పనేనా? ఎక్కడో మారుమూలన, నిర్జన ప్రాంతంలో అలా జరుగుతోందంటే నమ్మవచ్చేమో..! విపక్షం కాస్త లాజిక్‌గా ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నాటుసారా కాసేవారికి అండగా నిలిచే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎస్ఈబీని ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యులు మంగళవారం కూడా సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో సీఎం స్పందిస్తూ అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అందరికీ అర్థమవుతోందని తెలిపారు. టీడీపీ సభ్యులు నాగరికంగా ప్రవర్తించాలని, సభ జరగకూడదనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. లాజిక్‌గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని, వారు ప్రస్తావిస్తున్న అంశాలపై తాను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కళ్లుగప్పి సారా తయారీ సాధ్యమేనా? దాదాపు 55 వేల జనాభా నివసిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైనా సారా కాయగలరా? అని సీఎం ప్రశ్నించారు. పైగా అది ఒక మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. 2011 లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉండగా ప్రస్తుతం దాదాపు 55 వేల మంది నివసిస్తున్నట్లు తెలిపారు. అక్కడ పోలీస్ స్టేషన్, వార్డు సచివాలయాలు, మహిళా పోలీస్‌లున్నారని చెప్పారు. వారందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మవచ్చని, జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో సారా కాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకు పొంతన ఉందా? ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుతోందంటూ మరోవైపు జనం సారా తాగుతున్నారని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నాటు సారా తాగిస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా అనే కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ‘రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు మరో రూ.25 వేల కోట్లు రుణానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని చంద్రబాబు అంటున్నారు. మద్యం విక్రయాలు బాగా పెంచి ఆదాయం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నాటు సారా తాగి మనుషులు చనిపోయారని చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు’ అని మండిపడ్డారు. ‘ఈనాడు’ వక్రభాష్యం ప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని తాను వ్యాఖ్యానించినట్లు ఈనాడులో వ్యంగ్యంగా రాశారని సీఎం పేర్కొన్నారు. 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 44 వేలు కాగా పదేళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇప్పుడు దాదాపు 55 వేల మంది ఉన్నట్లు చెప్పామన్నారు. దేశంలో 2 శాతం మరణాల రేటు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని, ఆ మరణాలు.. వృద్ధాప్యం, అనారోగ్యం, మరే ప్రమాదం వల్లైనా కావచ్చన్నారు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటుగా తీసుకుంటే ఏటా దాదాపు వెయ్యి మంది చనిపోతున్నారని, అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుందన్నారు. ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకరించి రాసిందన్నారు. నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదన్నారు. వేర్వేరు చోట్ల వారం వ్యవధిలో చోటు చేసుకున్నాయని, మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయన్నారు. అప్పుడు ఏ రాద్ధాంతం జరగలేదన్నారు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి పాతిపెట్టిన భౌతిక కాయానికి పోస్టుమార్టమ్ నిర్వహించిందన్నారు. నిజంగానే అది సారా మరణం అయితే ప్రభుత్వం పోస్టుమార్టమ్ నిర్వహిస్తుందా? అని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారం... ‘ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి.. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఢంకా భజాయించాలి... ఆ విధంగా గోబెల్స్ ప్రచారం చేయాలి. ఓ అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు విశ్వసిస్తారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు.. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదేపదే అదే విషయాన్ని చెబుతారు. కొన్ని మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు కలసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..’ అని సీఎం జగన్ మండిపడ్డారు. జరగని దాన్ని జరిగినట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయడానికి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతే కానీ ఇలాంటి ప్రవర్తనతో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని టీడీపీ సభ్యులకు సూచించారు. బడ్జెట్ చర్చల్లో విపక్షం పాలుపంచుకోవాలని, సలహాలు ఇస్తే నోట్ చేసుకుంటామన్నారు. పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే వ్యవహరిస్తూ కొత్త రూల్ ప్రకారం సస్పెండ్ కాదలచుకుంటే వారి ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. -
నెల్లూరు జిల్లా గుడిపాడులో నాటుసారా స్థావరాలపై పోలీసు దాడులు
-
గరళాన్ని కాస్తున్న గోదారి లంకలు
హలో సార్...ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు తూర్పు గోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ సుమిత్ సునీల్ గర్డ్ ఫోన్ రింగ్ అయింది. హలో చెప్పండి.. సార్.. నేను ప్రత్తిపాడు మండలంలోని తోటపల్లి గ్రామ వలంటీర్‌ను.. ఓకే.. చెప్పండి.. సార్.. మా ఊర్లో పెద్ద ఎత్తున నాటుసారా కాచి వేలాది లీటర్లను పీపాల్లో పెట్టి భూమిలో పాతి నిల్వ చేశారు సార్.. సరే నేను చూస్తాను.. అంటూ ఏఎస్పీ ఫోన్ కట్ చేశారు. వెంటనే కాకినాడ డీఎస్పీ ప్రసాద్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడి నుంచి యాక్షన్ టీమ్ రంగంలోకి దిగింది. తోటపల్లి గ్రామ వలంటీర్ అందించిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. ఉదయం 7.50 గంటలకు ఎస్ఈబీ టీం తోటపల్లి ఫారెస్ట్‌లో కూంబింగ్ మొదలు పెట్టింది. 10 గంటలకు 112 సారా ఊట పీపాలను గుర్తించింది. 10.05 గంటలకు డీఎస్పీ ప్రసాద్.. సిబ్బందితో బయలు దేరారు. గంటన్నరపాటు ప్రయాణించి తోటపల్లికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాలకు పైగా అడవిలో కాలినడకన ముందుకు సాగి.. సారా డంప్ ఉన్న చోటుకు చేరారు. 22,400 లీటర్ల ఊటను వెలికి తీసి ధ్వంసం చేశారు. ఆదివారం అయినప్పటికీ ఎస్ఈబీ టీం 8 గంటలపాటు శ్రమించి సారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసింది. ఇలా ప్రతిరోజూ గోదారి లంక గ్రామాల్లో జల్లెడ పడుతూ.. నాటు సారా బట్టీలను ఎస్ఈబీ బృందాలు ధ్వంసం చేస్తున్నాయి. గోదావరి లంకలు.. సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలు.. కొల్లేరు దిబ్బలు.. సెలయేటి గట్లు.. పిల్ల కాలువ మాటున బట్టీలు పెట్టి రాత్రిళ్లు నాటు సారా కాస్తున్నారు. దాన్ని ఇసుక తిన్నెలు, గడ్డివాముల్లో కప్పిపెడుతున్నారు. డిమాండ్ మేరకు గ్రామాల్లోకి తరలించి పగటి పూట అమ్మకాలు సాగిస్తున్నారు. అక్రమార్జన కోసం కొందరు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నీటిలో బెల్లం కలిపి దాన్ని పులియబెడతారు. దాంట్లో అమ్మోనియా, యూరియా, ఈస్ట్.. కిక్కు కోసం మసాలా దినుసులు, ఎండు మిర్చి, స్పిరిట్, యాసిడ్ వంటి వాటిని కలిపి వేడి చేసి, సారా తయారు చేస్తారు. ఎక్కడికక్కడ గ్రూపులుగా సారా తయారీ సాగుతోంది. ఇదొక మాఫియాగా పరిణమించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దాడులు ముమ్మరం చేసింది. జనం గొంతులో గరళం నింపుతున్న ‘నాటు సారా’పై వేటు వేస్తోంది. -ఇర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 2010లో కల్తీ సారాకు 21 మంది బలయ్యారు. అంబాజీపేట మండలం మొసలపల్లి, జి.అగ్రహారం, అమలాపురం మండలం పాలగుమ్మి, బండారులంక గ్రామాలకు చెందిన పేదలు కల్తీ సారాతో మృత్యువాత పడటం అప్పట్లో సంచలనం రేపింది. అదే ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో 17 మంది నాటు సారాకు బలయ్యారు. 2013లో ఆలమూరు మండలం మడికి శివారు ప్రాంతం నాగులపేటకు చెందిన సీతెన రాజబాబు (59) కల్తీ సారా తాగి మృత్యువాతపడ్డాడు. సారా మహమ్మారిని తరిమికొట్టాలంటూ రంగంపేట మండలం మర్రివాడలో గతంలో యువత ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోను మహిళలు అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమాలు చేశారు. గత సర్కారు హయాంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. బైండోవర్లు.. రౌడీషీట్లు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలను సాకారం చేసే దిశగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్ యూనిట్ల ద్వారా పక్కా కార్యాచరణతో, ఒక్కో యూనిట్లో ఒక్కో ఐపీఎస్ అధికారి(ఏఎస్పీ)కి బాధ్యతలు అప్పగించడం ద్వారా ముందుకు సాగుతోంది. గ్రామాల్లో నాటుసారా కట్టడికి ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ (కార్యాచరణ) అమలులోకి తెచ్చింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే కొరియర్ (వేగుల) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ.. ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? తదితర వివరాలను ఎస్ఈబీ ప్రత్యేక బృందాలు సేకరించాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్ స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. వాటిలో భారీగా సారా తయారు చేస్తున్నవి 141, ఒక మోస్తరువి 249, తక్కువ మోతాదువి 292 కేంద్రాలు ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు. సమన్వయం.. సామాజిక పరివర్తన లాఠీకి పని చెప్పినా వినని వారికి లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తేవడంలో పోలీసులు చేస్తున్న కొత్త ప్రయోగం వారిలో ‘పరివర్తన’ తెస్తోంది. ఇలా రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి జిల్లాగా కృష్ణా జిల్లా రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలిచింది. 5 లక్షల లీటర్లకుపైగా సారా స్వాధీనం రాష్ట్రంలో ఎస్ఈబీ ఏర్పాటైన గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలపై దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. 5,00,482 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 1,26,26,673 లీటర్ల బెల్లపు ఊట (సారా తయారీకి ఉపయోగించేది) ధ్వంసం చేశారు. 38,595 కేసుల్లో 32,372 మందిని అరెస్టు చేశారు. 4,653 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఆదివారం 200 మందితో కూడిన 12 ఎస్ఈబీ ప్రత్యేక బృందాలు 35 వేల లీటర్లకు పైగా నాటు సారా ఊటను ధ్వంసం చేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసి, ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎస్ఈబీ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి. – డి.గౌతమ్ సవాంగ్, డీజీపీ సారా తయారు చేస్తే పీడీ యాక్ట్ సారా తయారీ మానకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతాం. రౌడీషీట్లు తెరుస్తాం. అయినా సారా తయారీ మానకపోతే వారి ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన వారిని వెంటనే రిమాండ్‌కు పంపించేలా జ్యుడిషియల్ వ్యవస్థను సంప్రదిస్తున్నాం. నిఘా తీవ్రతరం చేశాం. మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఇన్ఫార్మర్లు, ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. – వినీత్ బ్రిజ్‌లాల్, కమిషనర్, ఎస్ఈబీ ‘పరివర్తన’కు ప్రయత్నిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సారా తయారీదార్లు, తయారు చేస్తున్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. తయారీదార్లలో మార్పు తెచ్చేందుకు డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. వారికి నయానా, భయానా నచ్చజెప్పి సారా జోలికి పోకుండా ‘పరివర్తన’ తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. – పీహెచ్డీ రామకృష్ణ, డైరెక్టర్, ఎస్ఈబీ సామాజిక బాధ్యతలో గర్వంగా ఉంది ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో మేము భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. నాటుసారా తయారీ నిలిపి వేసే కుటుంబాలకు ఉపాధి చూపించడంలో భాగంగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 170 కుటుంబాలకు చెందిన యువతకు అవుట్ సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాం. – పామర్తి గోపీచంద్, చైర్మన్, పీవీఎన్నార్ సంస్థ సారా జోలికి పోకుండా ఉద్యోగం ఇప్పించారు చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలోని లంబాడీ తండాలోని చాలా కుటుంబాలకు దశాబ్దాల తరబడి నాటు సారా తయారీయే జీవనాధారం. ఎంటెక్, బీటెక్, డిగ్రీ, ఇంటర్ చదివిన మా తరం యువతకు చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. దీంతో మేము ఉపాధి కోసం మళ్లీ నాటుసారా తయారీ జోలికి పోకుండా పోలీసులు మాకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చారు. నాకు ఠాకూర్ ఆక్వా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం ఇప్పించారు. – బుక్యా శ్యామ్ సుందర్ సారా ప్రాణం తీస్తుంది.. సారా తయారీదారులు కిక్కు కోసం అనేక ప్రమాదకరమైన సరుకులు వాడుతున్నారు. కిక్కు కోసం, ఘాటు కోసం వాడే ఆ పదార్థాల వల్ల మనిషి గొంతు నుంచి జీర్ణాశయం వరకు దెబ్బతింటోంది. లివర్ సంబంధమైన అనేక తీవ్ర వ్యాధులతో ప్రాణాలు పోయే వరకు దారితీస్తోంది. కిక్కు కోసం అనేక మంది వ్యసనపరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారి కుటుంబాలను దిక్కులేని వారుగా చేస్తున్నారు. – బి.దుర్గాప్రసాద్, ప్రభుత్వ వైద్యాధికారి, భీమవరం -
సారా బట్టీల్లోంచి.. సమాజంలోకి!
రాసనపల్లె.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఉన్న ఒక చిన్న ఊరు. 700 జనాభా మాత్రమే ఉన్న ఈ ఊరు నాటు సారా తయారీకి బాగా ప్రసిద్ధి. ఒక్క రోజులో 50 వేల లీటర్ల నాటు సారా కావాలన్నా తయారుచేసి ఇవ్వగల సత్తా ఈ ఊరి సొంతం. ఒకప్పుడు ఈ గ్రామంలోని అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అబ్బాయికి కట్న కానుకలతోపాటు ఓ బస్తా బెల్లం, రెండు కుండలు ఇచ్చేవారు. అంటే.. ఆ ఊరి అల్లుడు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ సారా తయారుచేసుకోవచ్చన్నమాట. అయితే.. ఇదంతా గతం. ఇప్పుడు రాసనపల్లె మారింది వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ కట్టడికి, మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలు, సారా తయారీ కుటుంబాలకు అధికారులు కల్పించిన అవగాహన, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం వంటి చర్యలతో రాసనపల్లె మారింది. సారా తయారీని మానుకుని బాగు దిశగా ముందుకెళ్తోంది. యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తుండగా పెద్దలు వివిధ పనులు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. –చిత్తూరు అర్బన్ విద్యుత్, రేషన్ నిలిపేసినా.. రాసనపల్లెలో 160 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దాదాపు అన్ని కుటుంబాలు నాటు సారా తయారీపై ఆధారపడ్డవే. తమిళనాడు– కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుకు దగ్గరలో రాసనపల్లె ఉండటం వీరికి కలిసి వచ్చింది. రాసనపల్లె ప్రజల్ని మార్చడానికి 1990లో అధికారులు ఆ ఊరికి విద్యుత్ సరఫరా, రేషన్ నిలిపేశారు. అయినా ఒక్కరిలోనూ మార్పు రాలేదు. సర్కార్ ప్రత్యేక దృష్టి నాటుసారా తయారీ, అక్రమ మద్యం నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని రంగంలోకి దించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఇతర అధికారులు స్వయంగా రాసనపల్లెను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. నాటుసారా తయారీ వల్ల ఊరికున్న చెడ్డపేరు, దీనివల్ల పాఠశాలల్లో చదువుకుంటున్న ఆ ఊరి పిల్లలపై ఉన్న వివక్ష వంటివాటిని వివరించారు. ప్రస్తుతం అక్రమ మద్యం తయారీదారులకు విధిస్తున్న కఠిన జైలు శిక్షలు కూడా గ్రామస్తుల్లో మార్పుకు కారణమయ్యాయి. ఇక వద్దనుకుంటున్నాం.. 1990లో మా ఊరందరికీ మూడు నెలలపాటు రేషన్, రెండు నెలలుపాటు కరెంట్ కట్ చేశారు. అయినా మేమెవరం తగ్గలేదు. ప్రస్తుత ప్రభుత్వం బాగా సీరియస్‌గా ఉంది. ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని కాపాడనంటున్నారు. ఇక సారా తయారీ వద్దనుకుంటున్నాం. – ప్రకాష్, మాజీ సర్పంచ్, రాసనపల్లె మా జీవితాల్లో మార్పు వచ్చింది రాసనపల్లె అంటే చాలు మమ్మల్ని దొంగల్లా చూసేవాళ్లు. కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు మా ఊరు వచ్చి మాతో మాట్లాడారు. దీంతో మా జీవితాల్లో మార్పు వచ్చింది. – పీటర్, మాజీ ఎంపీటీసీ, రాసనపల్లె ట్యాక్సీ తోలుకుంటున్నా.. ఒకప్పుడు నాటు సారా కాస్తూ పట్టుబడితే ఏదో ఒక పార్టీ నాయకులు విడిపించేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్.. సారా కాయనని రూ.5 లక్షలతో తహసీల్దార్ వద్ద షూరిటీ ఇవ్వమన్నారు. మళ్లీ సారా కాస్తే రూ.5 లక్షలు పోతాయన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ట్యాక్సీ తోలుకుంటున్నా. – దీపక్, రాసనపల్లె ఆవులు మేపుకొంటున్నా 1984లో డబ్బుల్లేక చదువు మానేశా. దీంతో సారా బట్టీలు పెట్టాను. కొన్నాళ్లపాటు బాగానే జరిగినా నా పిల్లలకు తెలిస్తే ఏమనుకుంటారోననే దిగులు పట్టుకుంది. అన్నీ వదిలేసి రెండు ఆవులు మేపుకొంటున్నా. – రాజేంద్ర, రాసనపల్లె వారిని ఆదుకుంటాం.. రాసనపల్లెలో ప్రతి ఒక్క కుటుంబంతో స్వయంగా మాట్లాడాను. సారా తయారీని అందరూ మానుకుంటున్నారు. ఇదే సమయంలో వారి అవసరాలను గుర్తించడం, ఆర్థికంగా ఆదుకోవడానికి నివేదికలు రూపొందించాం. – డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా, జిల్లా కలెక్టర్, చిత్తూరు. -
పెచ్చుమీరుతున్న సారా తయారీ
జిల్లాలో 84 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. విక్రయ వేళలు తగ్గాయి. బార్లను కూడా 40 శాతం మూసేయడానికి కసరత్తు ప్రారంభమైంది. దీన్ని అదనుగా తీసుకున్న కొందరు సారా తయారీపై దృష్టిపెట్టారు. విచ్చలవిడిగా తయారుచేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అబ్కారీ శాఖ ఇప్పటికే దాడులు ముమ్మరం చేసినా.. సిబ్బంది కొరత వేధిస్తుండడంతో అన్ని వైపులా దృష్టి పెట్టలేకపోతోంది. సాక్షి, చిత్తూరు: ‘జిల్లా వ్యాప్తంగా సారా తయారీ కేంద్రాలపై శనివారం నిర్వహించిన దాడుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు 2,900 లీటర్ల ఊట ధ్వంసం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టుచేశారు. 14 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. 64 లీటర్ల సారాను సీజ్ చేశారు. అధికారులు దాడులు చేస్తున్న ప్రతిసారీ వేల లీటర్ల సారా ఊట లభ్యమవుతోంది’ మద్యానికి ముకుతాడు మద్యం విక్రయాలు, పాలసీపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాలపై మహిళలతో పాటు అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో అప్పటివరకు ఉన్న 430 మద్యం దుకాణాల్లో.. ప్రస్తుతం 344 మిగిలాయి. ఏటా మరో 20 శాతం దుకాణాలను తగ్గించుకుంటూ వెళుతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 40కు పైగా ఉన్న బార్లలో తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్లో 20 మాత్రమే మిగిలాయి. అలవాటు మానుకోలేక.. గతంలో వేళాపాళా లేని మద్యం విక్రయాలు, 24 గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉన్న బెల్టు దుకాణాల ద్వారా మందుబాబులకు ఎనీటైమ్ మద్యం లభించే పరిస్థితి ఉండేది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాత్రి 8 గంటలు దాటితే మద్యం దుకాణాలు మూసేస్తున్నారు. బార్లలో రేట్లు అధికంగా ఉండడంతో మద్యాన్ని క్రమంగా మానేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటే.. గత ప్రభుత్వ హయాంలో ఆదాయానికి అలవాటుపడ్డ వారు మాత్రం మద్యం స్థానంలో సారాను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ ప్రాంతాల్లోనే అధికం జిల్లాలో సారా తయారీలో 8 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో సారాను ఓ కుటీర పరిశ్రమగా నడుపుతున్నారు. గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు నగరం, పాలసముద్రం, గంగాధరనెల్లూరు, బైరెడ్డిపల్లె, వాలీ్మకిపురం, పులిచెర్ల, ములకలచెరువు, కుప్పం, ప్రాంతాల్లో సారా తయారీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. రోజూ ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దాడుల్లో 3 వేల లీటర్ల వరకు సారా ఊట ధ్వసం చేస్తూ.. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేస్తున్నారు. తెరవెనుక వాళ్లేరి? సారా తయారీ, విక్రయాల వల్ల పేదల సంపాదన గంట మత్తు కోసం ఖర్చు పెట్టేస్తుండడంతో పాటు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. మరోవైపు సారా తయారీ, విక్రయాల్లో కూలి పనిచేసే పేదలు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారే తప్ప.. వారికి తెరవెనుక ఉంటూ నడిపిస్తున్న ప్రధాన వ్యక్తులను అధికారులు పట్టుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సారాపై ఉక్కుపాదం మోపాలని, ఎవర్నీ ఉపేక్షించొద్దని అబ్కారీశాఖ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినాసరే అధికారులు మాత్రం చిన్నా చితక కూలీలను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికితోడు ఎక్సైజ్ శాఖలో వందకు పైగా కానిస్టేబుల్ పోస్టులు దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఎవర్నీ వదలడం లేదు సారా తయారీలో కూలీలు, యజమానులు అని తేడా లేదు. తయారీ, విక్రయాల వద్ద అరెస్టు చేస్తున్నవాళ్లు తెలిపే వివరాల ఆధారంగా వారి వెనుక ఉన్నవారిపై కూడా కేసులు పెడుతున్నాం. ఇందుకోసం పోలీసుశాఖ కూడా మాకు బాగా సహకరిస్తోంది. మూడు నెలల్లో 40 శాతం వరకు సారా విక్రయాలు, తయారీని అరికట్టాం – నాగలక్షి్మ, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ -
ఎక్కడున్నా నాగులూరిని అరెస్టు చేస్తాం..
సాక్షి, ప్రకాశం : పశ్చిమ ప్రాంతంలో నాటుసారా సరఫరాలో కింగ్ మేకర్‌గా పేరు పొందిన నాగులూరి ఏసును ఎక్కడున్నా అరెస్టు చేసి తీరుతామని మార్కాపురం ఈఎస్ ఆవులయ్య హెచ్చరించారు. సోమవారం రాత్రి 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈఎస్ కథనం ప్రకారం.. పొదిలి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో గోగినేనివారిపాలెం సమీపంలో 100 లీటర్ల నాటుసారా స్వా«దీనం చేసుకుని అరుణ్‌కుమార్, కోటేశ్ అనే ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారణ చేయగా వచ్చిన సమాచారం మేరకు చీమకుర్తి మండలం గురవారెడ్డిపాలేనికి చెందిన షేక్ బీబీని అరెస్టు చేశారు. మరో వైపు విచారణలో సారా అమ్మకాలు సాగిస్తున్న పోలా ఏసును సింగరాయకొండ సీఐ లత ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వీరి నుంచి 20 లీటర్ల నాటుసారా, 75 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీరికి కింగ్ మేకర్‌గా నాగులూరి ఏసు వ్యవహరిస్తున్నారు. నాగులూరి కుటుంబ సభ్యుల సహకారంతో విచ్చలవిడిగా నాటుసారా కేంద్రాలను గతంలో నిర్వహించారు. అతడిని పది రోజుల్లో అరెస్టు చేస్తామని ఈఎస్ ఆవులయ్య విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. నాటుసారా తయారీని అరికట్టేందుకు తమ శాఖ కృత నిశ్చయంతో ఉందన్నారు. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌ను నియమించినట్లు చెప్పారు. నాగులూరి ఏసు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కాపుసారాపై మెరుపు దాడులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుసారాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ప్రత్యేక బృందాల ద్వారా ఈ వారం అంతా ఆకస్మిక దాడులు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ణయించారు. నాటుసారాపై ఫిర్యాదులు స్వీకరించి దాడులు చేసేందుకు ఎక్సైజ్ కమిషనరేట్‌లో 1800 425 4868 టోల్ ఫ్రీ నంబరుతోపాటు రెండు బెటాలియన్ల పోలీసులను సిద్ధం చేశారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసుల సహకారంతో సారా మహమ్మారిని తరిమికొట్టాలని ఎక్సైజ్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజన రాష్ట్రంలోని 191 మండలాల్లో కాపుసారా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 682 గ్రామాల్లో కాపుసారా తయారీ, విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల వద్ద సమాచారం ఉంది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో దీనిప్రభావం అత్యధికంగా ఉంది. కాపు సారా తయారీని ‘ఏ’ కేటగిరీ, విక్రయాలను ‘బి’ కేటగిరీ, సరఫరాను ‘సీ’ కేటగిరీగా విభజించారు. ఏ కేటగిరీలో 141 గ్రామాలు, బీ కేటగిరీలో 249 గ్రామాలు, సీ కేటగిరీలో 292 గ్రామాలున్నాయి. నాలుగు నెలల్లో 5,687 కేసులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కాపుసారా తయారీపై 5,687 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 3,410 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం కేసులు అధికంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దాడుల్లో 378 వాహనాల్ని సీజ్ చేశారు. రెండు నెలల్లో నియంత్రిస్తాం రాష్ట్రంలో సారా అనేది లేకుండా చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. రెండు నెలల్లో కాపు సారాను నియంత్రించేలా కార్యాచరణ రూపొందించాం. ‘ఏ’ కేటగిరీ గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తయారీదారుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – ఎం.ఎం. నాయక్, ఎక్సైజ్ కమిషనర్ -
కా‘సారా’ కటకటాలకే
దశలవారీగా మద్యనిషేధానికి నడుంకట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదిశగా వేగంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా గ్రామాల్లో బెల్టుషాపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. దాంతో ‘సారా’ హవా విస్తరించేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వారికి చెక్ చెబుతూ ఎక్సైజ్‌శాఖ విస్తృతంగా చర్యలు చేపడుతోంది. సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం) : ‘నేను చూశాను.. నేను విన్నాను.. నేనున్నాను’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మద్యం మహమ్మారితో చితికిపోతున్న కుటుంబాలను, మహిళల కష్టాలను గమనించారు. మద్యంతో, బెల్టు షాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు మహిళలు ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను రద్దు చేశారు. మద్యం షాపుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. మద్యం విక్రయాలపై ఆంక్షలు పెరగడంతో నాటుసారా తయారీకి వ్యాపారులు సమాయత్తమవుతున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ బట్టీలు పెరిగే అవకాశం ఉండడంతో ఎక్సైజ్ శాఖ దానిపై దృష్టి సారించింది. సారా వ్యాపారులు పంటపొలాల్లో సారా బట్టీలను ఏర్పాటు చేసి తయారు చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ సిబ్బంది మాత్రమే కాకుండా పోలీసులు కూడా నాటుసారా తయారీపై దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సారాను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ఎక్కువగా తీరప్రాంతంలో సరుగుడు తోటలు, వ్యవసాయ భూములలో, ఇసుక మేటల మధ్య సారా బట్టీలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే దాడులు ముమ్మరం చేసి ఎక్సైజ్, పోలీసు సిబ్బంది పలువురిని అరెస్టు చేసి వందల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు, పలువురిపై కేసులు సైతం నమోదు చేశారు. నాటు సారాయే చీప్ లిక్కర్ బట్టీలలో తయారు చేసిన నాటుసారాను ఖాళీ మద్యం సీసాలలో నింపి చీప్ లిక్కర్‌గా అమ్మేందుకు సారా వ్యాపారులు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నాటు సారాకు రంగు కలిపి క్వార్టర్ సీసాల్లో చీప్ లిక్కర్‌గా సీలు వేసి అమ్మకాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈతరహా తయారీ ఎన్నికల సమయంలో జోరుగా సాగింది. ఇప్పుడు దానిని కొనసాగించే ప్రయత్నాల్లో కొందరు ఉన్నట్టు తెలుస్తోంది. సారా తయారీకి ప్రత్యేక పంథా తక్కువ సమయంలో ఎక్కువ సారా తయారు చేయడానికి తయారీ దారులు కొత్త పంథాను అవలంబిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక గొట్టాలను ఉపయోగిస్తున్నారు. బట్టీలో సారా కాస్తుండగా ఆగొట్టం ద్వారా ఎప్పటికప్పుడు సారా తయారై పీపాలలోకి వస్తుంది. అదే గతంలో అయితే సారా తయారు కావడానికి, చల్ల బడడానికి సమయం పట్టేది. కానీ ఇపుడు నిమిషాలలో లీటర్ల కొద్ది సారా తయారవుతోంది. ఎక్కడ చూసినా బట్టీలలో వేలాది లీటర్ల బెల్లం ఊటలు లభిస్తున్నాయి. కఠిన చర్యలు తప్పవు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాలు సారా స్థావరాలను గుర్తించే పనిలో ఉన్నాయి. ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తోంది. నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలో ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహించినా, ఎవరైనా వారికి మద్యం సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా బెల్టు షాపు నిర్వహిస్తున్నట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక సిబ్బంది ద్వారా బెల్టు షాపులను పూర్తిగా మూయించి వేశాం. నాటుసారా బట్టీల పైనా దృష్టి సారిస్తున్నాం. నాటుసారా నిల్వలు, అమ్మకాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజను కోరుతున్నాం. – కె.కాత్యాయని, ఎక్సైజ్ సీఐ, పిఠాపురం -
వంద రోజుల ప్రణాళిక
మహబూబ్‌నగర్‌క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలను అరికట్టడంతో పాటు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ అమలు, సమయపాలనను పరిశీలించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయసేనారెడ్డి వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని డీసీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రణాళిక వివరాలు వెల్లడించారు. ప్రతీరోజూ.. ప్రతీ స్టేషన్ ఉమ్మడి జిల్లాలో గుడుంబ నియంత్రణ, కల్తీ కల్లు నియంత్రణ, బెల్టు దుకాణాలను అదుపు చేయడంపై ఈ వంద రోజుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని డీసీ తెలిపారు. ఈ ప్రణాళికను ఉమ్మడి జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని.. ప్రతీ రోజు, ప్రతీ స్టేషన్ ఆధ్వర్యాన ఒక కార్యక్రమం చేపడుతామన్నారు. ప్రణాళికలో తొలి 25రోజుల పాటు ‘ఏ’ గ్రేడ్ గ్రామాల్లో తనిఖీలు, ఆ తర్వాత 25రోజుల పాటు ‘బీ’ గ్రేడ్ గ్రామాలు, మరో 25 రోజులు ‘సీ’ గ్రేడ్ గ్రామాల్లో తనిఖీలు చేశాక చివరి 25రోజులు అన్ని గ్రామాల్లో క్రాస్ తనిఖీలు ఉంటాయని తెలిపారు. ఈ తనిఖీలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది కాకుండా ఇతర స్టేషన్ల చెందిన సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. రాబోయో 25రోజుల్లో జిల్లాలో 104తనిఖీలు, 111మంది బైండోవర్లు, 134సార్లు పరిశీలన 97శాతం కల్తీ కల్లు, నాటుసారాను కట్టడి చేయనున్నామని వివరించారు. కాగా, గతంలో బైండోవర్ అయిన వ్యక్తులు మళ్లీ అవుతున్నారా అనే అంశాన్ని సిబ్బంది ప్రత్యేకంగా పరిశీలిం చాలని, మద్యం దుకాణాలు సమయపాలన, పర్మిట్ రూం నిబంధనలు అమలుచేస్తు న్నాయా, లేదా అని చూడడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఫిర్యాదులకు అవకాశం జిల్లాలో ఎక్కడైనా సారా తయారీ, కల్తీ కల్లు అమ్మకాలతో పాటు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎవరైనా టోల్‌ప్రీ నంబర్ 18004252523కు ఫోన్ చేయొచ్చని డీసీ జయసేనారెడ్డి తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయాలనుకుంటే 94409 02282( మహబూబ్‌నగర్ డీసీ) 94409 02607(మహబూబ్‌నగర్ ఈఎస్) 94409 02606 (జోగుళాంబ గద్వాల, వనపర్తి ఈఎస్), 94409 02613 (నాగర్‌కర్నూల్ ఈఎస్)కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జోగుళాంబ గద్వాల, వనపర్తి ఇన్చార్జి ఈఎస్ విజయ్‌భాస్కర్, ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సారా విక్రయిస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకుడు
సుండుపల్లి : మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ రాగిమానుబిడికిలో సారాను విక్రయిస్తున్న టీడీపీ జిల్లా నాయకుడు బీలు నాయక్‌ను రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు, ఎస్ఐ నరసింహారెడ్డి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం నాకాబందిలో భాగంగా రాగిమానుబిడికి గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బీలునాయక్ ఇంటిలో నాటు సారా నిల్వ ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బీలునాయక్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జోసెఫ్ తెలిపారు. -
నాటు సారాకు కొత్త రెక్కలు
రాష్ట్రంలోని పల్లెల్లో నాటుసారా మళ్లీ గుప్పుమంటోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అమ్మకాలపై నిఘా పెట్టినా.. ‘చక్కెర’రూపంలో కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. గోదావరి నది వెంట.. అడవి మొదట్లో.. వ్యవసాయ బావుల వద్ద గుడుంబాగా విరగకాస్తోంది. సారా, గుడుంబా తయారీకి కొంతకాలంగా దూరంగా ఉన్నవారంతా.. తిరిగి మళ్లీ సారా వైపు మళ్లుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని గుడుంబారహితంగా మార్చడం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కఠిన చర్యలు చేపడుతోంది. సారా తయారీపైనే ఆధారపడిన కుటుంబాల పునరావాసం కోసం ఆర్థిక సాయమూ చేస్తోంది. దీంతో కొంతకాలం పాటు నాటుసారా, గుడుంబాల తయారీ తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పల్లెల్లోకి చొరబడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అందకుండా కట్టడి చేసినా తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. బెల్లానికి ప్రత్యామ్నాయంగా నేరుగా చక్కెరనే వినియోగిస్తూ సారా తయారు చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో మొలాసిస్తో నాటుసారా కాస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో నాటుసారా తయారీ చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఖమ్మం జిల్లాలో జోరుగా..: పాత ఖమ్మం జిల్లా పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణం మినహా చుట్టూ ఉన్న మండలాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. నల్లబెల్లానికి బదులుగా చక్కెరతో గుడుంబా తయారీని మొదలుపెట్టింది ఈ ప్రాంతం వారేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి గుడుంబా స్థావరాలపై దాడులు చేసినప్పుడల్లా భారీగా చక్కెర నిల్వలు పట్టుబడుతుండడం గమనార్హం. కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీదారులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్లబెల్లం బదులుగా చక్కెర వాడుతున్న విషయాన్ని వెల్లడించారు. దుమ్ముగూడెంతోపాటు చర్ల, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అటవీ ప్రాంతంలోనే సారా తయారు చేసి.. ప్యాకెట్లలో నింపి మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుడుంబా మాఫియా సాధారణ గిరిజన కుటుంబాలు కాసిన నాటుసారాను సేకరించి.. ప్యాకెట్లలో నింపి టోకున విక్రయిస్తోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం పారిశ్రామికవాడతోపాటు సమీప పల్లెలు, మండల కేంద్రాల్లో కలిపి రోజుకు సుమారు 1,000 లీటర్ల గుడుంబా విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. చక్కెర ఎందుకంటే..? రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణల కారణంగా నల్లబెల్లం దొరకడం లేదు. ఎక్కడైనా దొరికినా కిలో రూ.90 నుంచి రూ. 110 దాకా పలుకుతోంది. అది కూడా నమ్మకస్తులైన వారికే విక్రయిస్తున్నారు. అదే చక్కెరకు ఎంతైనా దొరుకుతుంది. నల్లబెల్లంతో పోలిస్తే చౌకగా వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.45 వరకు ఉంది. అయితే వ్యాపారులు ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఖండసారి చక్కెర (కాస్త నలుపుగా, నాణ్యత తక్కువగా ఉండే స్థానిక మిల్లుల చక్కెర)ను తీసుకొచ్చి రూ.35కే కిలో చొప్పున సారా తయారీదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సారాకు చక్కెర వినియోగం పెరిగింది. అక్కడ 60 శాతం చక్కెర సారాకే! గుడుంబా తయారీకి చక్కెర వినియోగంపై ‘సాక్షి’బృందం భద్రాచలం పట్టణంలో పరిశీలన చేసింది. ఇక్కడ దాదాపు 12 హోల్‌సేల్ చక్కెర దుకాణాలు ఉన్నాయి. గతంలో వీరంతా కలిపి నెలకు ఆరు లోడ్ల (లోడుకు 17 టన్నుల) చక్కెర విక్రయించేవారు. కానీ కొద్దినెలలుగా నెలకు 16 లోడ్ల చక్కెర అమ్ముడుపోతోంది. అంటే 272 టన్నుల చక్కెర వినియోగం అవుతోంది. అయితే ఇందులో 60 శాతం చక్కెరను సారా తయారీ కోసం వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో మొలాసిస్తో.. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మొలాసిస్ (చెరుకు రసం నుంచి చక్కెర తయారు చేయగా మిగిలే మడ్డి)తో గుడుంబా తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు వాటి సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరుకు సాగు ఎక్కువ. ఖండసారి చక్కెర కర్మాగారాలు విస్తృతంగా ఉన్నాయి. వాటిలో చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలిన మొలాసిస్‌ను లీటర్ రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. గుడుంబా తయారీదారులు ఈ మొలాసిస్‌ను కొనుగోలు చేసుకువెళ్లి.. గుడుంబా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు, కృష్ణా, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కల్హేర్, న్యాల్కల్ తదితర మండలాలు, నిజామాబాద్ జిల్లా భీంగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా గుప్పుమంటోంది. అదిలాబాద్ జిల్లాలో జైనథ్, బోథ్, వాంకిడి, ఉట్నూర్ తదితర మండలాల్లో మొలాసిస్తో గుడుంబా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల వెనుకంజ! రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి స్థాయిని కేసుల నమోదు ద్వారా అంచనా వేస్తుంటారు. కేసులు ఎక్కువగా నమోదైతే నాటుసారా విక్రయాలు ఎక్కువగా ఉన్నట్టు. లేకుంటే తయారీ లేనట్టే. దీంతో ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలో సారా తయారీ లేదనిపించుకోవడం కోసం కేసులు నమోదు చేయడమే లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన వారిని బెదిరించి వదిలేస్తున్నారని అంటున్నాయి. దాంతో సారా తయారీ నిరాటంకంగా సాగిపోతోంది. ఇలా చేస్తున్నారు? బిందెడు నీళ్లలో రెండు మూడు కిలోల చక్కెర కలిపి ద్రావణం తయారు చేస్తున్నారు. అందులో పాచిపోయిన అన్నం, తవుడు, టైర్లు, ట్యూబుల ముక్కలు వేసి కొన్ని రోజుల పాటు పులియబెడుతున్నారు. దానికి పలు రకాల రసాయనాలు కలిపి.. మరగబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఇది నిరాటంకంగా జరిగిపోతోంది. -
ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు
అశ్వారావుపేటరూరల్: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలంలోని అంతారం, గుండ్లగూడెంలలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 10 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.