వీపనగండ్లలో విషాదం | tragedy in veepanagandla | Sakshi
Sakshi News home page

వీపనగండ్లలో విషాదం

Published Sun, Jan 7 2018 6:29 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

tragedy in veepanagandla - Sakshi

వనపర్తి జిల్లా : వీపనగండ్ల మండలం గోపాలదిన్నె గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్ల రోజా(28) అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసేసింది. అనంతరం తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో  ఇద్దరు కూతుళ్లు వందన(8), లాస్య(5) కూడా మరణించారు. బంధువుల అంత్యక్రియల నిమిత్తం అత్తమామలు పొరుగూరికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement