బాలుడు చిట్టి
ఖమ్మంక్రైం : ఖాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న రైలులో చిట్టి అనే మూడున్నరేళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన ఒక వ్యక్తి ఖమ్మంలో వన్‌టౌన్ పోలీసులకు బాలుడిని అప్పగించారు. చైల్డ్‌లైన్–1098 జిల్లా సమన్వయ కర్త కువ్వారపు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజీపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ రైలులో చిట్టి అనే బాలుడు ఒంటరిగా తిరుగుతున్నాడు.
గమనించిన శ్రీనివాస్ బాబును చేరదీసి వివరాలు అడగడంతో వివరాలను తెలుపలేకపోయాడు. దీంతో అతను ఖమ్మంలో దిగగానే వన్‌టౌన్ ఎస్సై రాంకు అప్పగించారు. వారు చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ టీం వెళ్లి బాబును బాలల సంరక్షణ సమితి చైర్మన్ ఎంఎల్ ప్రసాద్ మౌఖిక ఆదేశాల మేరకు శిశుగృహలో ఉంచారు. బాబు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ తగిన ఆధారాలతో సంప్రదిస్తే బాబును అప్పగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment