
భోపాల్: విశ్వహిందూ పరిషత్ సభ్యుడొకరు దారుణ హత్యకు గురైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హోసంగాబాద్ జిల్లా వీహెచ్‌పీ గోరక్షక్ శాఖ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి విశ్వకర్మ (35)ని కొందరు దుండగులు కాల్చి చంపారు. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆయన శుక్రవారం కారులో ఇంటికి వెళ్తుండగా పిపారియా పట్టణం వద్ద 10 మంది మూక వారిపై పదునైన ఆయుధాలతో దాడి చేసింది. అనంతరం కాల్పులు జరిపింది.
ఛాతీలో బుల్లెట్ దిగడంతో రవి అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పిపారియా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఎస్‌ఐ సతీష్ అంధ్వాన్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే రవి విశ్వకర్మను దారుణంగా హత మార్చారని వీహెచ్‌పీ ప్రాంతీయ సహ మంత్రి గోపాల్ సోని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
(చదవండి: కరోనాతో సీనియర్ వీడియో జర్నలిస్టు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment