సాక్షి, విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 చానెల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. వీడియో జర్నలిస్టు మురళి మృతి పట్ల రాష్ట్ర సమాచార, రవాణా శాఖమంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి కుటుంబానికి పేర్ని నాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కూడా వీడియో జర్నలిస్టు మురళి ప్రసాద్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
విషాదం
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి అపోలో టైర్స్ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలపైకి ఓ వ్యాన్ దూసుకెళ్ళింది. పనులు ముగించుకుని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్యాస్ సిలిండర్‌పేలి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అప్పనపల్లిలో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు దగ్దమైంది. సమాచారం అందకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 4 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఇంటి యజమాని రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment