ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను.. | Wife Caught Husband With Lover In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

Published Sat, Sep 14 2019 11:25 AM | Last Updated on Sat, Sep 14 2019 11:42 AM

Wife Caught Husband With Lover In Hyderabad - Sakshi

భర్త ప్రియురాలితో ఓ ఇంట్లో ఉన్నాడని..

సాక్షి, హైదరాబాద్‌ : యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు బడిత పూజ చేసిందో భార్య. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చీపురుతో, చెప్పుతో బుద్ధిచెప్పింది. ఈ సంఘటన అల్వాల్‌లోని సుభాష్‌ నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గోపాల్‌ అనే వ్యక్తికి  ఏడు సంవత్సరాల క్రితం ఎస్తర్‌ ఏంజల్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక గోపాల్‌ భార్యను దూరంగా ఉంచటం ప్రారంభించాడు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు.

ఈ నేపథ్యంలో భర్త ప్రియురాలితో ఓ ఇంట్లో ఉన్నాడని ఏస్తర్‌ తెలుసుకుంది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. ఎస్తర్‌తో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా గోపాల్‌, అతడి ప్రియురాలిపై దాడి చేశారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement