ప్రియుడి మోజులో భర్త హత్య | Wife Killed Husband With Boy Friend In Anantapur | Sakshi
Sakshi News home page

ప్రియుడి మోజులో భర్త హత్య

Published Mon, May 21 2018 7:43 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Wife Killed Husband With Boy Friend In Anantapur - Sakshi

నిందితులను చూపుతున్న పోలీసులు

అనంతపూర్, సోమందేపల్లి: వివాహేతర సంబంధం సాగిస్తున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేయించిన కేసును ఛేదించినట్లు పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్, సీఐ శ్రీనివాసులు తెలిపారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. వారి కథనం మేరకు... గత నెల 30వ తేదీ మండలంలోని రేణుకానగర్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(40) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు మృతుడిని సోమందేపల్లి మండలంలోని కొత్తపల్లి క్రాస్‌కు చెందిన వడ్డెరాముగా గుర్తించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. రాముకు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మితో కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే ఆమెకు బోయ అశోక్‌ అనే ఆటోడ్రైవర్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉండేది.

ఆ విషయం తెలుసుకున్న రాము ఆమెను అప్పటినుంచి వేధించడం ప్రారంభించాడు. అలాగే తన ఆస్తిలో కొంతభాగాన్ని బంధువులకు ఇవ్వడానికి పూనుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని హత్య చేస్తే తనకు అడ్డం తొలగిపోతుందని, ఆస్తి అంతా తనకే దక్కుతుందని లక్ష్మి భావించింది. గత నెల 30వ తేదీ ప్రియుడితో కలిసి భర్తను పెట్రోల్‌పోసి తగులబెట్టి దారుణంగా హత్య చేసింది. ఇందుకు ఆమె బంధువులు శిల్ప, ముద్దప్పగారి నరసింహులు సహకారం అందించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఇదంతా వెలుగుచూసింది. నిందితులను చాకర్లపల్లి గ్రామం వద్ద అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్‌ఐ తిరుపాల్‌నాయక్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement