
దన్నాన సంతోషి (ఫైల్)
విజయనగరం టౌన్ : ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో మహిళ మృతి చెందింది. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంకలాం గ్రామానికి చెందిన దన్నాన సంతోషి (27) భర్త పైడిరాజు, ఇద్దరు పిల్లలో గురువారం రాత్రి గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహం అనంతరం తిరుగుప్రయాణంలో ద్విచక్రవాహనంపై వస్తుండగా, ఎల్లమ్మ తల్లి గుడి వద్ద బైక్ అదుపు తప్పడంతో అందరూ కింద పడిపోయారు. అయితే సంతోషి తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో స్థానికుల సహాయంతో భర్త ఆమెను కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment