
చెన్నై,అన్నానగర్: ఏలుమలై సమీపంలో బుధవారం పెళ్లి ఆహ్వాన పత్రికలో పేరు వేసే విషయంలో ఏర్పడిన తగాదాలో మహిళ మృతి చెందింది. తండ్రి, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా, ఏలుమలై సమీపంలో ఉన్న తుళ్లుకూట్టి నాయకనూరుకు చెందిన రామర్ (60), చిన్నస్వామి బంధువులు. వీరి గృహాలు పక్కపక్కనే ఉన్నాయి. రామర్ కుమారుడు సతీష్‌కుమార్ (29) వివాహానికి అమ్మాయి ఇంటి వారు ఆహ్వాన కార్డును అచ్చుకొట్టారు.
ఆ కార్డులో చిన్నస్వామి పేరు వేయకూడదని రామర్ తరఫున వారు చెప్పారు. రామర్, చిన్నస్వామి మధ్య తగాదా ఏర్పడింది. బుధవారం చిన్నస్వామి భార్య అంగమ్మాల్ (66) సతీష్‌కుమార్‌ను చూసి తిట్టింది. ఇరు కుటుంబాల మధ్య తగదా ఏర్పడింది. అంగమ్మాల్ కిందపడి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స కోసం మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంగమ్మాల్ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామర్, సతీష్‌కుమార్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment