
జైపూర్ : రాజస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా కాలినడకన సొంతూరుకు బయలుదేరి మార్గమధ్యలో ఓ పాఠశాలలో విశ్రమించిన మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు దుండగులు. ఈ ఘటన రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్ బటోడా పోలీసు స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా మాధోపూర్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. నెలరోజులు అయినా లాక్‌డౌన్ తొలగించకపోవడంతో చివరకు చేసేదేమిలేక కాలినడకన సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె మాధోపూర్ చేరుకోగా, స్థానికులు అడ్డుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచారు.ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు అర్థరాత్రి పాఠశాలకు చేరుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మహిళను క్వారంటైన్‌కు తరలించి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment