నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా జీఆర్‌సీ.రెడ్డి బాధ్యతల స్వీకరణ
కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఇన్‌చార్జి డెరెక్టర్‌గా జీఆర్‌సీ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రస్తుత ఇన్‌చార్జి డైరెక్టర్ ఆర్‌వీ చలం.. జీఆర్‌సీ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన జీఆర్‌సీ రెడ్డి వరంగల్ ఆర్‌ఈసీ (ప్రస్తుత నిట్)లో 1973 నుంచి 1976 వరకు ఎమ్మెస్సీ టెక్ (ఫిజిక్స్) పూర్తి చేశారు.
కాజీపేట రూరల్ : కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఇన్‌చార్జి డెరెక్టర్‌గా జీఆర్‌సీ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రస్తుత ఇన్‌చార్జి డైరెక్టర్ ఆర్‌వీ చలం.. జీఆర్‌సీ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన జీఆర్‌సీ రెడ్డి వరంగల్ ఆర్‌ఈసీ (ప్రస్తుత నిట్)లో 1973 నుంచి 1976 వరకు ఎమ్మెస్సీ టెక్ (ఫిజిక్స్) పూర్తి చేశారు. అలాగే ఇదే డిపార్ట్‌మెంట్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. అనంతరం ఆర్‌ఈసీలోనే 1980లో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1985 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1995 వరకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత 2005 వరకు ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా, 2005–2010 వరకు నిట్ కాలికట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2011లో గోవా నిట్ డైరెక్టర్‌గా వెళ్లా రు. ప్రస్తుతం అక్కడ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఆర్‌ఈసీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం రెడ్డి గోవా నిట్ డైరెక్టర్‌గా బా ధ్యతలు నిర్వర్తిస్తుండడంతోపాటు తెలంగాణలోని వరంగ ల్ నిట్, ఆంధ్రాలోని తాడే పెల్లిగూడెం నిట్‌లకు కూడా ఇన్ చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా, జీఆర్‌సీ రెడ్డికి నిట్ డీన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు బొ కేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వరంగల్ ఆర్‌ఈసీలో చదువుకుని, ఉద్యోగం చేసిన వ్యక్తి తిరిగి ఇక్కడికే ఇన్‌చార్జి డైరెక్టర్‌గా రావడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్తా
నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా జీఆర్‌సీ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నిట్‌ను అంతర్జాతీయ విద్య ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లేం దుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రధానమంత్రి పథకాలు మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాల్లో వరంగల్ నిట్ పాల్గొంటుందన్నారు. ఇతర దేశాలతో ఎంఓ యూకు కృషి చేస్తానన్నారు. గ్లోబల్ ఇన్నిషెడ్ ఆఫ్ అకాడమిక్ నెట్ (జీఐ.ఏఎన్.) ద్వారా నిట్‌లో విద్యార్థులకు విదేశీ ఫ్యాకల్టీలతో బోధనలు అందించనున్నట్లు చెప్పారు.