సంక్షోభంలో వ్యవసాయరంగం
సంక్షోభంలో వ్యవసాయరంగం
Published Wed, Aug 24 2016 9:46 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
నల్లగొండ టౌన్ : వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం దారుణమన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ పూర్తిగా అవనీతిమయమైందని విమర్శించారు. ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, కె.కాంతయ్య, నెల్లికంటి సత్యం, గోద శ్రీరాములు, ఎల్.శ్రవన్, సృజన తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement