రైతాంగ అభివృద్ధే లక్ష్యం
రైతాంగ అభివృద్ధే లక్ష్యం
Published Mon, Sep 26 2016 9:30 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
నూతనకల్ : రైతాంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశ్‌ర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మద్దిరాల శివారులో శ్రీరాంసాగర్ రెండవ దశ పరిధిలోని 69డీబీఎం ద్వారా విడుదలైన గోదావరి జలాలకు పూజలు చేశారు.
కార్యక్రమంలో కోదాడ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్‌ఏ రజాక్, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, రాంపాక సైదులు మంజుల, గూడ అన్నమ్మ శివలింగారెడ్డి, వడ్డానం మధు, గూడ వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలన్ని పూర్తిస్థాయిలో నిండి నిండుకుండల్లా మారాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ సంక్షేమం కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులల్లో నీటి నిల్వ పెరిగి రెండు సంవత్సరాల దాక రైతులకు భూగర్భజలాలు అధిక మొత్తంలో లభిస్తాయని ఆయన అన్నారు. తుంగతుర్తి, నూతనకల్ మండలాల పరిధిలోని వర్షాపాతం తక్కువగా ఉండటం వలన చెరువులు, కుంటలు నిండకపోవడం వలన ఇక్కడి ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరాంసాగర్ రెండవ దశ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి చెరువులు, కుంటలు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కాల్వలో నీటి ప్రవాహం తక్కువగా ఉందని వెంటనే నీటి ప్రవాహం పెంచే విధంగా అధికారులకు సూచనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు గోదావరి జలాలను ఉపయోగించుకొని చెరువులు, కుంటలను నింపుకోవాలని ఆయన కోరారు. ఈ
Advertisement