వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుల ప్రస్తావన రాలేదని ఆపార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు.
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుల ప్రస్తావన రాలేదని ఆపార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆలూరి సాంబశివారెడ్డి స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీకి కులపిచ్చి ఉండడంతోనే తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికీ పాటు పడ్డారని గుర్తు చేశారు. అదే అభిమానం, నమ్మకంతోనే ఆయన ఆశయాలు కొనసాగిస్తారని అన్ని వర్గాలు ప్రజలూ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్నాయన్నారు.
ఆయనలా పదవులు, కాంట్రాక్ట్‌లను ఆశించిన వారెవరూ లేరన్నారు.నిజంగా వైఎస్ కుటుంబంతో జేసీ వ్యక్తిగతంగా అనుబంధం ఉంటే ఇళ్లవద్ద ఎలాగైనా మాట్లాడాలని, బహిరంగ సమావేశాల్లో ఇలా మాట్లాడడం తగదన్నారు.ఇలానే వ్యహరిస్తే ప్రజలు తిరగబడతారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అదేదో రాయలసీమ రెడ్డి కులస్తులకు ప్రతినిధి అన్నట్లు మాట్లాడడం కూడా సరికాదన్నారు.