2017–18 విద్యా సంవత్సరంలో ఏపీఆర్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : 2017–18 విద్యా సంవత్సరంలో ఏపీఆర్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీఆర్‌జేసీలో జనరల్ బాలురకు నాగార్జునసాగర్, కొడిగెనహళ్లి, గ్యారంపల్లి, వెంకటగిరి, జనరల్ బాలికలకు బనవాసి, నిమ్కూరు (కో ఎడ్యుకేషన్), తాటిపూడి కళాశాలలున్నాయన్నారు. అన్ని కళాశాలల్లోనూ ఎంసెట్, ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుందని వారు వివరించారు.
డిగ్రీ కళాశాలలు నాగార్జున సాగర్ (బాలురు), కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల (కో ఎడ్యుకేషన్) ఉన్నాయని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, రూ.150 చెల్లించి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే 4న ఉంటుందన్నారు.