వెంపల్లె(వైఎస్సార్‌జిల్లా): మూడు రోజుల కిందట ప్రారంభించిన నూతన ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా వెంపల్లె మండల కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలోని ఏటీఎంలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. టాటా ఎండిక్యాష్ సంస్థ వారు రెండు రోజుల కిందట స్థానికంగా ఏటీఎంను ప్రారంభించారు.
అందులో శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు సీసీ కెమరాలు ధ్వంసం చేసి మిషన్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ రోజు ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
Published Sun, Oct 4 2015 9:59 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement