పల్లకీ మోసిన చోట పది మంది కూడా లేరు
బాపట్ల: రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పని చేయటంతోనే పల్లకీS మోసిన చోటే పదిమంది లేకుండా పోయారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కనుమూరి బాపిరాజు అన్నారు. అన్నిపార్టీలు కలిసి నోట్ ఇవ్వటంతోనే రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ప్రయోజనాల కోసం చట్టాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎన్జీవో హోమ్‌లో సోమవారం బాపట్ల నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. కనుమూరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే... ఇచ్చిన 600 హామీలు నెరవేర్చని టీడీపీకి మరీ ఏ పరిస్థితి వస్తోందో ప్రజలే తీర్పునిస్తారన్నారు. మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతతో బీజేపీ, టీడీపీలను ఇంటికి పంపేరోజులు దగ్గరపడుతున్నాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి జేడీశీలం మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై బీజేపీ, టీడీపీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి చేజర్ల నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు లేళ్ళ వెంకటప్పయ్య, మిరియాల రామకోటేశ్వరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలీమ్, అబ్దుల్ వలి, యాతం మోజేస్‌రాజు, మాసా చంద్రశేఖర్, రవి, నీశాంత్, దోనేపూడి దేవరాజు, కోటా వెంకటేశ్వరరెడ్డి, మంతెన రామచంద్రరాజు, మద్దాల డేవిడ్ తదితరులున్నారు.