నల్లమల సిగలో అగ్ని శిఖ | beautiful agni shikha in nalamala forest | Sakshi
Sakshi News home page

నల్లమల సిగలో అగ్ని శిఖ

Published Thu, Sep 15 2016 7:55 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

నల్లమల సిగలో అగ్ని శిఖ - Sakshi

నల్లమల సిగలో అగ్ని శిఖ

ఆత్మకూరు రూరల్‌: మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పచ్చటి నల్లమల అడవులను తాకుతూ.. కొండల మీదుగా వెళ్తున్న మేఘాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి–బైర్లూటి ప్రాంతంలో ఔషధ మొక్క శంకర పుష్పి(అగ్ని శిఖ) అత్యంత రమణీయంగా కనువిందు చేస్తోంది. అరవిరిసిన అగ్నిశిఖ పుష్పాలపై నీటి బిందువులు ఎర్రని ముత్యాలను తలపిస్తున్నాయి. ఆగి ఆగి కురుస్తున్న వర్షం.. అగ్నిశిఖ అందం నల్లమల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement