బ్యాంకు అధికారులమంటూ టోకరా | cheating name with Bank officials | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారులమంటూ టోకరా

Published Wed, Jul 20 2016 12:17 AM | Last Updated on Sat, Jun 2 2018 5:51 PM

ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని గుర్తుతెలియని వ్యక్తి కోరగా అతడిని నమ్మి చెప్పడంతో రూ.5 వేలు అతడి ఖాతా నుంచి డ్రా అయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఏటీఎం కార్డు నంబర్‌ తెలుసుకొని రూ.5 వేలు డ్రా
 
సంగెం : ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని గుర్తుతెలియని వ్యక్తి కోరగా అతడిని నమ్మి చెప్పడంతో రూ.5 వేలు అతడి ఖాతా నుంచి డ్రా అయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లి శివారు సోమ్లాతండాకు చెందిన బానోత్‌ రాజేందర్‌కు ఈ నెల 15న సంగెం ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ 7808602755 నంబర్‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు.
 
ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని కోరారు. అడిగినట్లుగా ఆ నంబర్లు చెప్పిన రాజేం దర్‌ సెల్‌ఫోన్‌కు తన ఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. బ్యాంకుకు వచ్చి తనఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయిన విషయం బ్యాంకు అధికారులకు చెప్పడంతో తాము చేసేది ఏమి లేదని చేతులెత్తేశారు. దీంతో నెత్తినోరు బాదుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement