రూ.2 వేల నోటును కలర్ జెరాక్స్‌తీసి మార్చబోయిన వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి..
జెరాక్స్ నోటుతో బురిడీ.. ముగ్గురికి రిమాండ్
Published Fri, Nov 18 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
టి.నరసాపురం : రూ.2 వేల నోటును కలర్ జెరాక్స్‌తీసి మార్చబోయిన వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. మక్కినవారిగూడెం పంచాయతీ పరిధిలోని గౌరీశంకరపురం గ్రామానికి చెందిన పొలిమెరశెట్టి సత్యనారాయణ, బొబ్బేటి ఆనందరావు రూ.2 వేల నోటును కలర్ జెరాక్సు తీయిం చి మక్కినవారిగూడెంలో మద్యం దుకాణంలో మార్చేందుకు ప్రయత్నించారు. మద్యం దుకాణంలో పనిచేస్తున్న తాళ్లూరి శివరామారావు దీనిని చెల్లని నోటుగా గుర్తించి తిరస్కరించాడు. దీంతో సత్యనారాయణ, ఆనందరావు వాగ్వాదానికి దిగా రు. మద్యం దుకాణం సిబ్బందిని వీరిద్దరినీ బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ వారిని ప్రశ్నిం చగా గౌరీ శంకరపురానికి చెందిన కిరాణా వ్యాపారి బోశెట్టి వరప్రసాద్ తన షాపులో ఉన్న మెషి¯ŒS నుంచి కలర్ జెరాక్సు తీసి ఇచ్చినట్టు చెప్పారు. దీంతో సత్యనాయణ, ఆనందరావుతో పాటు వరప్రసాద్‌పై ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి చింతలపూడి కోర్టుకు రిమాండ్‌కు పంపారు.
Advertisement
Advertisement