సీఐ సంతోష్‌ను అభినందించిన డీజీపీ
Published Sat, Sep 3 2016 12:31 AM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM
వరంగల్ : కృష్ణా పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సీఐ ఆర్.సంతోష్‌ను డీజీపీ అనురాగ్ శర్మ అభినందించారు. రూరల్ ఎస్పీకి అటాచ్‌్డగా ఉన్న సీఐ సంతోష్‌ను పుష్కరాల్లో విధులు నిర్వహిం చేందుకు గత నెల 10వ తేదీన నల్లగొండ జిల్లాకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అయ్యప్ప ఘాట్ వద్ద 23వ తేదీ వరకు విధులు నిర్వర్తించారు. ఈ మేరకు పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్తరించినందుకు డీజీపీ ఆయనకు హైదరాబాద్‌లో ప్రశంసా పత్రం, నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీ సులు ఆయనను అభినందించారు.
Advertisement
Advertisement