సీఎం పర్యటనకు స్థలం పరిశీలన
యర్రగొండపాలెం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 4వ తేదీన యర్రగొండపాలెం వస్తున్న సందర్భంగా కలెక్టర్ సుజాతశర్మ ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం, సీడీపీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. జన్మభూమి–మా ఊరు సభలో భాగంగా సీఎం యర్రగొండపాలెం రానున్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎస్పీ డాక్టర్ సీఏం త్రివిక్రమవర్మ, జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డిలతో కలెక్టర్ సుజాతశర్మ సమీక్షించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వేదిక, మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో హెలీప్యాడ్, పైలాన్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. మార్కాపురం రోడ్‌లో తూర్పు వైపు ఉన్న భవనాలు పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో సీఎం పర్యటనకు సంబంధించి కలెక్టర్, ఎస్పీ సమీక్షించారు. వేదిక వద్దకు వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని వాహనాలు పార్కింగ్ చేసేందుకు ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మైదానాలను ఎస్పీ త్రివిక్రమవర్మ పరిశీలించారు. కలెక్టర్ సుజాతశర్మ వెంట స్థానిక ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నె రవీంద్ర, ఆర్డీఓ కె.చంద్రశేఖరరావు, మార్కాపురం ఓఎస్డీ లావణ్యలక్ష్మి, డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, సీఐలు డి.మల్లికార్జునరావు, వి. శ్రీరాం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కాంతనా«థ్, ఈఈ మల్లికార్జునరావు, డిప్యూటీ ఈఈ జె.లక్ష్మానాయక్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రశేఖరయ్య, ఈఈ జయరామ్‌దాస్, జేడీఏ మురళీకృష్ణ, ఐసీడీఎస్ పీడీ విశాలాక్షి, సీడీపీఓ వెంకటలక్ష్మమ్మ, ఏడీ వెంకటేష్ ప్రసాద్, ఏపీఆర్‌ఓ మల్లేష్, తహసీల్దార్ ఎం. రత్నకుమారి, ఎంపీడీఓ టి.హనుమంతురావు, జెడ్పీటీసీ సభ్యుడు ఎం. మంత్రూనాయక్, సర్పంచి సొరకాయల మంగ మ్మ, స్థానిక అధికారులు పాల్గొన్నారు.