- అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు, నల్లగొండ జిల్లాల మధ్య వివాదానికి కారణమైన ‘డిండి’ ప్రాజెక్టు అంశాన్ని త్వరగా తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రాజెక్టు డిజైన్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు త్వరగా పరి ష్కారం చూపాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించిన సీఎం డిండి ప్రాజెక్టు అంశాన్ని సైతం ఇంజనీర్ల వద్ద ప్రస్తావించినట్లుగా తెలిసింది.
శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీకి బదులు ఒక టీఎం సీ నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో పాలమూరు-రంగారెడ్డి పథకానికి నీటి కొ రత ఏర్పడుతుంది. ఇదే సమయంలో డిండి అలైన్‌మెంట్ ద్వారా మహబూబ్‌నగర్ జి ల్లాలోని కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ముం దుకు కదలడం లేదు. బడ్జెట్‌లో మాత్రం డిండికి రూ. 700 కోట్ల వరకు కేటాయిం చారు.
ఈ నేపథ్యంలోనే సమీక్షించిన సీఎం కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం లేకుండా, పా లమూరు ప్రాజెక్టుకు అవసరమయ్యే నీటిలో కొరత రాకుండా ప్రత్యామ్నాయాలను అ న్వేషించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయాలను సిద్ధం చే సి రెండుమూడు రోజుల్లో తనకు నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం. ఈ ని వేదికను ఆధారం చేసుకొని ఈ వివాదానికి పరిష్కారం చూపే అవకాశం ఉంది.