మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన తండ్రి మల్లేష్ ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రాజు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన తండ్రి మల్లేష్ ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రాజు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జనవరి 29 నుంచి కనిపించడం లేదని, ఎన్ని చోట్ల వెతికినా జాడ కానరాలేదని పేర్కొన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 96181 50227 నంబరుకు లేదా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరాడు.