కర్ణాటక యువతికి 'కళ్యాణలక్ష్మి' డబ్బులు
Published Tue, Apr 12 2016 7:21 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
పెద్దేముల్ (రంగారెడ్డి) : కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా కర్ణాటకకు చెందిన యువతికి డబ్బులు ఇచ్చారంటు ఓ వ్యక్తి సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో మంగళవారం వెలుగుచూసింది. ఓ వైపు కళ్యాణ లక్ష్మి పథకం పక్కదారి పడుతోందని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటే.. మరో వైపు కొందరు నకిలీ ధృవ పత్రాల సాయంతో కళ్యాణ లక్ష్మి డబ్బులు స్వాహా చేస్తున్నారని ఆత్కూర్ తండాకు చెందిన రాందాస్ వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజకు పిర్యాదు చేశారు.
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా మగ్ధల్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి స్థానిక తండాకు చెందిన యువకుడితో వివాహం జరిగింది.ఆ అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలో జన్మించిందని దొంగ సర్టిఫికెట్లు సృష్టించి కళ్యాణ లక్ష్మి డబ్బులు తీసుకున్నారంటు రాందాస్ మంగళవారం పెద్దేముల్‌కు వచ్చిన సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్ బుధవారంలోగా పూర్తి నివేదిక అందజేయాలని తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Advertisement