
మిన్నంటిన నిరసనలు
► సెల్‌టవర్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన
► కిరోసిన్ పోసుకున్న మహిళ
► ఎస్పీకి ఫిర్యాదు.. నిర్మాణం అడ్డుకున్న పోలీసులు
సిరిసిల్ల టౌన్: ప్రజల భాగోగులు పరిరక్షించాల్సిన టీఆర్‌ఎస్ నాయకుడు స్వయంగా..జనావాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించడంపై స్థానికుల నుంచి నిరసనలు మిన్నంటాయి. సదరు ఇంటి యజమాని టీఆర్‌ఎస్ నేతకావడంతో పోలీసు లు పట్టిచుకోవడం లేదంటూ..ఏకంగా ఓమహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకునిఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈసంఘటన శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నెహ్రూనగర్‌లోని అధికార పార్టీ కి చెందిన నాయకు డు, సెస్ మాజీ డైరెక్టర్ గుండ్లపెల్లి శ్రీని వాస్ ఇంటిపై ప్రె ౖవేటు సెల్ కంపెనీకి చెందిన సెల్‌టవర్ నిర్మాణం జరుగుతుం ది. ఈవిషయమై గతంలో వద్దని తాము చెప్పి నా సదరు నాయకడు వినకుండా టవర్ నిర్మా ణం పనులు చేపట్టాడంటూ ఆరోపించారు.
రేడియేషన్ ద్వారా ప్రజలు రోగాల భారిన పడుతారని చెప్పినా అధికార పార్టీ నాయకుడు ఆర్థికలాభం కోసం పాకులాడుతున్నాడని ఆరోపించారు. ఈవిషయమై స్థానికులతో సదరు నాయకుడు రెండు గంటల పాటు వాగ్వాదానికి దిగాడు. టవర్ సమీపంలో ఉండటం వల్ల తమ కుటుంబ సభ్యులు నంది కనుకవ్వ అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాలని వెంటనే సెల్‌టవర్ నిర్మాణం నిలిపి వేయాలని కోరుతూ.. స్థానికులు అన్నపూర్ణ, అమల, రాజవ్వ తదితరులు ఎస్సీ, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.