'భూ కొనుగోళ్లపై శ్వేతపత్రం ఇవ్వాలి' | congress leader undavalli arun kumar fires on AP govt over amaravathi land scam | Sakshi
Sakshi News home page

'భూ కొనుగోళ్లపై శ్వేతపత్రం ఇవ్వాలి'

Published Sat, Mar 5 2016 12:05 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'భూ కొనుగోళ్లపై శ్వేతపత్రం ఇవ్వాలి' - Sakshi

'భూ కొనుగోళ్లపై శ్వేతపత్రం ఇవ్వాలి'

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. రాజమండ్రిలో శనివారం ఆయన మాట్లాడుతూ... అమరావతి భూముల విషయంలో వెబ్ సైట్ ఎందుకు బ్లాక్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

టీడీపీ నేతలు, మంత్రులు  అమరావతి పరిసర గ్రామాల్లో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములుకొన్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.32 వేల కోట్లకు ఎలా పెంచారో వివరించాలని అడిగారు. పట్టిసీమ నుంచి కృష్ణాజిల్లాకు నీరిస్తే గోదావరి డెల్టా రైతుల పరిస్థితేంటి అని ప్రశ్నించారు. ప్రతి అంశంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం సరికాదని ఉండవల్లి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement