ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగా రాష్ట్రంలో రాజకీయ విలువలు దిగజారిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
అల్లీపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగా రాష్ట్రంలో రాజకీయ విలువలు దిగజారిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విశాఖ నగరం అల్లీపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
పతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు ఆశచూపి కొంటున్న ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మానుకోకుంటే మున్ముందు మిగతా పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.