విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రయూనివర్శిటీలో గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. రిలే దీక్షలు చేపట్టిన విద్యార్థులను పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు ఈ రోజు పరామర్శించారు.
అలాగే బాక్సైట్ తవ్వకాల జీవోపై అరకు సీపీఎం కార్యాలయంలో ఈరోజు రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు హాజరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీవో జారీ చేసిందని ఆయన ఆరోపించారు. 1/ 170 అటవీ హక్కుల చట్టంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలను జరుపుకోవచ్చని పేర్కొనలేదని నర్సింగరావు స్పష్టం చేశారు.