భార్యను తీసుకెళ్లేందుకు అత్త వారింటికి వెళ్లిన ఓ జవాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
కైకలూరు: భార్యను తీసుకెళ్లేందుకు అత్త వారింటికి వెళ్లిన ఓ జవాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ...పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెంనకు చెందిన కాటూరి చంద్రశేఖర్(27) ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. అతడు కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన యువతితో వివాహం అయింది. పెళ్లయిన నాటి నుంచి వారి మధ్య సఖ్యత లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆమె పుట్టింట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో భార్యను తీసుకెళ్లేందుకు చంద్రశేఖర్ సోమవారం విశ్వనాద్రిపాలెం గ్రామానికి వచ్చాడు. రాత్రి అత్త, భార్య, భార్య సోదరితో వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ క్రమంలోనే పట్టుతప్పి అతడు బండపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ ను అత్తింటి వారు చంపేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.