నాసిరకం పనులపై విచారణ చేయాలి | Crumbling works should be prosecuted | Sakshi
Sakshi News home page

నాసిరకం పనులపై విచారణ చేయాలి

Published Wed, Jul 20 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

నాసిరకం పనులపై విచారణ చేయాలి

నాసిరకం పనులపై విచారణ చేయాలి

మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం తుంగపాడు నుంచి దామరచర్ల మండల అడవిదేవులపల్లి వరకు నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డులో నాసిరకం పనులపై విచారణ జరిపించాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. బుదవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు పనులు నాసిరకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందరి సమక్షంలో విచారణ జరిపించాలని ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌పీఎస్‌ జిల్లా ఉపాద్యక్షులు గోపిరెడ్డి, శ్యామ్‌సుందర్‌రెడ్డి, నాయకులు చెల్కపల్లి సతీష్, దొండా వెంకన్న యాదవ్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement