
కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి రోజు బోటింగ్
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఇకనుంచి ప్రతి రోజు పర్యాటకులకు బోటింగ్ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులోకి 19 అడుగుల వరకు వర్షపునీరు చేరడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు రోజు రావడంతో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో భారీగా నీరుందని కొంతమంది గాలాలతో చేపలు పడుతున్నారు. యువతీ, యువకులు నీటిలో ఈత కొట్టడం, పాటలు పాడతూ, డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు యువకులు ఈ ప్రాంతంలో ఓ షార్ట్ ఫిలీంలో బాగంగా ఓ పాటను పూర్తి చేశారు.