హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
మహేశ్వరం: మామిడితోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుండగులు హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మహేశ్వరంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో ఆదివారం దుర్వాసన రావడంతో కార్మికులు పరిశీలించారు. ఓ కుళ్లిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు వ్యక్తిని వేరే ప్రాంతంలో హత్య చేసి రాత్రివేళలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
మామిడితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం
Published Sun, Jul 24 2016 11:00 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement