శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి.
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. 92 డిగ్రీ కళాశాలల్లో 14,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా వాయిదాపడిన మొదటి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ తేదీల ఖరారుపై శనివారం అధికారులు కసరత్తు చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ సోమవారం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.