జంపన్నవాగులో భక్తుడి గల్లంతు
Published Mon, Jul 25 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
మేడారం: వరంగల్ జిల్లా జంపన్న వాగులో పుణ్య స్నానానికి దిగిన భక్తుడు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. వరంగల్ కు చెందిన శ్రీధర్‌కుమార్(28) ఆదివారం స్నేహితులతో కలిసి అమ్మవారి గద్దెలను దర్శించుకోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో జంపన్న వాగులో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. ఇది గమనించిన అతని స్నేహితులు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సోమవారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Advertisement
Advertisement