శ్రావణ పూర్ణిమకు భక్తుల రద్దీ
శ్రావణ పూర్ణిమకు భక్తుల రద్దీ
Published Thu, Aug 18 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
పాత గుంటూరు : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏడో రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీకి యాత్రికుల సంఖ్య అధికంగా పెరిగిందని ఆర్టీసి ఆర్‌ఎం జె.శ్రీహరి తెలిపారు. 2004లో జరిగిన పుష్కరాలలో 12 రోజులకు గాను 10,15,812 మంది ప్రయాణించగా, ఈసారి ఏడు రోజుల్లోనే 16,36,464.మంది యాత్రికులు ప్రయాణించి ఆర్టీసి గుంటూరు రీజియన్ రికార్డు సాధించిందని తెలిపారు. ఆర్‌ఎం శ్రీహరి గురువారం తెల్లవారుజామునే పుష్కర ఘాట్‌లకు వెళ్లే బస్టాప్‌ల వద్దకు చేరుకుని యాత్రికులు అధికంగా ఉన్నచోట అదనపు బస్సులను ఏర్పాటు చేశారు.
అమరావతిలోని పుష్కర నగర్‌లో కార్మికులతో, ఆర్టీసి సిబ్బందితో కలిసి ఆర్‌ఎం సహపంక్తి భోజనం చేశారు. ఉద్దండరాయునిపాలెం నుంచి తాళ్ళాయపాలెంకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సులకు మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు. గురువారం నాడు మొత్తం 1105 బస్సుల్లో 3,04,296 మంది యాత్రికులను జిల్లాలోని వివిధ స్నాన ఘట్టాలకు చేర వేసినట్టు ఆయన తెలిపారు. వీటిలో మొత్తం 3282 ట్రిప్‌లను ఉచితంగా తిప్పి 1,29,058మంది యాత్రికులను ఘాట్‌లకు చేరవేసినట్లు వివరించారు.
Advertisement
Advertisement