జిల్లా ఓటర్లు 29,55,432
– పురుషులు 14,93,260
– మహిళలు 14,61,951
– థర్డ్ జెండర్ 221
అనంతపురం అర్బన్ : యువ ఓటర్ల నమోదును జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను వయస్సుల వారీగా జిల్లా ఎన్నికల అధికారులు గురువారం విడుదల చేశారు. జిల్లాలో పురుష ఓటర్లతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 29,55,432 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 14,93,260 ఉండగా మహిళ ఓటర్లు 14,61,951 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 221 మంది ఉన్నారు. అలాగే సర్వీసు ఓటర్లు 1,866 మంది ఉన్నారు. ఈ ఓట్లను జాబితాలో కాకుండా వేరుగా చూపించారు. అధికారిక లెక్కల ప్రకారం 18–21 ఏళ్ల వయస్సు ఉన్న యువ ఓటర్లు 38,029 మంది( 0.85 శాతం) ఉన్నారు. 1,61,958 మంది యువత ఓటర్లుగా (3.15 శాతం) నమోదు కావాల్సి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇక స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 979 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటరు, జనాభా నిష్పత్తిని గమనిస్తే ప్రతి వెయ్యి మంది జనాభాకు 676 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాలో వయస్సు వారీగా ఓటర్లు
వయస్సు పురుషులు మహిళలలు థర్డ్ జెండర్ మొత్తం
18–19 21,987 15,014 12 37,013
20–29 4,03,805 3,71,569 110 7,75,484
30–39 4,13,997 4,15,694 47 8,29,738
40–49 2,89,088 2,90,127 22 5,79,237
50–59 1,95,279 1,91,727 15 3,87,021
60–69 1,15,469 1,15,469 11 2,30,873
70–79 44,105 49,848 4 93,957
80 ఏళ్లపై 9,530 12,579 – 22,109
మొత్తం 14,93,260 14,61,951 221 29,55,432