రైల్వే గేట్లు తొలిగిస్తే ప్రాణాలు పోయినట్లే
Published Fri, Jul 22 2016 5:21 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
దొరవారిసత్రం : అక్కరపాక, మినమలముడి ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ రైల్వే గేట్లు తొలిగించి బాక్స్ టైప్ బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ప్రాణాలు పోయినట్లేనని గ్రామస్తులు రైతులు ప్రజాభిప్రాయం సేకరణలో జేసీ మహ్మద్ ఇంతియాజ్, సబ్ కలెక్టర్ గిరీషా, రైల్వే అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బాక్స్‌టైప్ బ్రిడ్జి నిర్మాణంపై ఇప్పటికే మూడుసార్లు రైల్వే అధికారులు ప్రజాభిప్రాయం సేకరించిన చేపట్టిన ప్రయోజనం లేకుండాపోయింది. గురువారం మరోసారి తహసీల్దార్ కార్యాలయంలో అభిప్రాయసేకరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రైతులు వరి కోతలు, చెరుక పంటల సమయంలో లారీలు బ్రిడ్జిల కింద నుంచి రాలేవని, దీంతో ఇబ్బందులుపడుతామని, రైల్వే గేట్లు అలాగే ఉంచాలని కోరారు. జేసీ మాట్లాడుతూ విపత్తుల సమయంలో నీళ్లు నిలబడకుండా పంచాయతీల్లోని వ్యక్తులను ఉద్యోగులుగా రైల్వే అధికారులు నియమించారన్నారు. అంతేకాకుండా బాక్స్‌టైప్ బ్రిడ్జిలు నిర్మించినా ఉన్న గేట్లు తొలిగించకుండా క్లోజ్ చేయాలని, విపత్తుల సమయంలో ఆ గేట్లు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు విజేత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు, రైల్వే అధికారులు డీఈ రామ్‌ప్రసాద్‌రావ్, ఏడీఈ రాబిన్‌రాజన్, వివిధ పార్టీ నాయకులు దువ్వూరు గోపాల్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
Advertisement