ఉపాధి శిక్షణ మరింత విస్తృతం
– డిగ్రీ అభ్యర్థులకూ క్యాంపస్ సెలక్షన్స్
– రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రయివేట్ రంగంలో ఉద్యోగాలకు అవసరమైన నేపుణ్యాలను యువతలో పెంపొందించేందుకు ఉద్దేశించిన శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పూర్తి చేసిన లక్షలాదిగా విద్యార్థులు బయటకు వస్తున్నా వారిలో ఉద్యోగ నైపుణ్యాలు లేవన్నారు. కనీసం కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ క్రమంలో వారికి శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పుతున్నట్లు చెప్పారు. పలు అంతర్జాతీయ సంస్థలతో అవగాహన కుదుర్చుకొని క్యాంపస్ డ్రై వ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ అభ్యర్థులకు కూడా క్యాంపస్ డ్రై వ్‌లను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.