భీమవరం అర్బన్ : భీమవరం రూరల్ పోలీ స్స్టేçÙన్ పరిధిలోని బీవీ రాజు నగర్‌లోని ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బొర్రావానిపాలెం గ్రామానికి చెందిన తోట శివ ప్రవల్లిక (19) ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు స్నేహితులతో సరదాగా గడిపిన ప్రవల్లిక 4.30 గంటల సమయంలో హాస్టల్లోని బాత్రూమ్లో చున్నీతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత దీనిని గమనించిన స్నేహితులు విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు. ఆమెను భీమవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రవల్లిక మృతిచెం దినట్టు వైద్యులు నిర్దారించారు. మృతురాలు తండ్రి వెంకట సుధాకర్‌కు విషయాన్ని తెలియజేశామని ట్రైనీ ఎస్సై టి.రవీంద్ర తెలిపారు.