పరారైన ఖైదీ బుగత శివను అరెస్టు చేసిన పోలీసులు
పరారీ ఖైదీ అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం సబ్‌జైలు నుంచి పరారైన ఇద్దరు రిమాండ్ ఖైదీల్లో ఒకరిని అరెస్టు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. గురువారం వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పలు చోరీలకు పాల్పడిన నేరంపై స్థానిక సబ్‌జైలుకు సిర్రపు గణేష్, బుగత శివను రిమాండ్‌కు తరలించారు. ఈనెల 10న వీరు సబ్‌జైలు గోడ దూకి పరారయ్యారు.
వీరిలో బుగత శివను బుధవారం చేబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో సీఐ మూర్తి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై సీహె చ్ ఆంజనేయులు అరెస్టు చేశారు. గురువారం తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. శివను తణుకు సబ్‌జైలుకు తరలించినట్టు పట్టణ పోలీసులు తెలిపారు.