చేతికొచ్చిన మిరప పంట వరదలో కొట్టుకుపోయిందని మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అమరావతి(గుంటూరు): చేతికొచ్చిన మిరప పంట వరదలో కొట్టుకుపోయిందని మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వెంకట్రావు(48) తనకు ఉన్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మిరప పంటను సాగు చేశాడు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట మొత్తం నీటిపాలైంది. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.