పాముకాటుతో రైతు మృతి
కంకిపాడు:
పాముకాటుకు గురై ఓ వ్యక్తి మరణించిన ఘటన నెప్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కొణతం శివయ్య (45) సోమవారం రాత్రి గేదెలకు వరిగడ్డి వేసేందుకు వెళ్లాడు. గడ్డి తీస్తుండగా పాము కాటు వేసింది. విషప్రభావంతో కొద్దిసేపటికే శివయ్య ప్రాణాలు విడిచాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతోపాటు సర్పంచి కొణతం గిరిధర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.