
ఎక్కడి కుప్పలు అక్కడే!
► లారీలు రాక, ఖాళీ సంచులు లేక..
► కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
► పేరుకుపోతున్న వేలాది వడ్ల బస్తాలు
► అక్కడే పడిగాపులు పడుతున్న రైతులు
► అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు
నర్సాపూర్: వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఖాళీ సంచులను సకాలంలో అందజేయలేకపోవడంతోపాటు,తూకం వేసిన ధాన్యం బస్తాలను రైసుమిల్లులకు పంపేందుకు లారీలను సమకూర్చడంలోనూ అధికారులు విఫలమవుతున్నా రు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని ఎçపుడు తూకం వేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. రో జుల తరబడి నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. స్థలా భావంతో కొత్తగా తూకం వేయడం నిలి పివేశారు. పలు చోట్ల ఖాళీ సంచులు లేక తూకం పనులు సాగడం లేదు.
ఇదీ పరిస్థితి
సొసైటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రంలో గురువారంనాటికి సుమారు మూడు వేల ధాన్యం బస్తా లను తూకం వేసి మిల్లులకు పంపేందుకు సిద్ధంగా ఉంచారు. లారీలు రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రెండు రోజులుగా ఖాళీ సంచుల కొరత ఏర్పడింది. లారీలు రాక తూకం వేసిన బస్తాలు ఇక్కడే ఉండిపో యాయి. స్థలం లేకపోవడం, సంచుల కొరతతో కొనుగో ళ్లను నిలిపేశారు. మండలంలోని ఖాజీ పేట కేంద్రంలో ఖాళీ సంచులు లేకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు సా గడం లేదు.
ఇక్కడ సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. రెడ్డిపల్లిలో సుమారు వెయ్యి బ స్తాల ధాన్యం నిలిచిపోయింది. సుమారు మూడు వేల బస్తాల «ధాన్యం కుప్పలు గానే ఉంది. ఇబ్రహీంబాద్‌లో సైతం ఇ లాంటి సమస్యలే ఉన్నాయి. అక్కడ సు మారు వెయ్యి బస్తాల ధాన్యం ఉండిపోయింది. ఈ విషయమై మండల ఐకేపీ కో ఆర్డినేటర్ గౌరీశంకర్‌ను వివరణ కోరగా, లారీలు రానందున తూకం వేసిన బస్తాలను రైసుమిల్లులకు పంలేకపోతున్నామని అన్నారు. స్థలం లేక తూకం వే యడం లేదన్నారు. శుక్రవారం ఉదయం వరకు అన్ని కేంద్రాలకు ఖాళీ సంచులు వస్తాయన్నారు. తూకం వేసిన బస్తాలు షిఫ్ట్ చేయగానే కొనుగోళ్లు ప్రారంభి స్తామని పేర్కొన్నారు.
రైతుల సమస్యలు పట్టవా?
రైతులు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం. బస్తాలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నా, ఖాళీ సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోతున్నా, రైతులు∙పడిగాపులు పడు తు న్నా ప్రజాప్రతినిధులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.