- భూ సేకరణపై అధికారులతో
- నేడు మంత్రి హరీశ్‌రావు సమీక్ష
దేవాదుల, ఎస్సారెస్పీపై దృష్టి
Published Fri, Sep 16 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
వరంగల్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1, స్టేజ్–2తో పాటు దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టి సారిం చారు. ఈ రెండు ప్రాజెక్టులపై సంబ«ంధిత శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో సమీక్షిస్తారని తెలిసింది.
ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో వ్యయం పెరిగిపోతోంది. ఇప్పటికే పలు దఫాలుగా వీడియో కాన్ఫరె¯Œ్సలో మంత్రి జిల్లా భూసేకరణ అధికారులైన జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్ తదితరులతో సమీక్షించినా ప్రగతి కనిపిం చడం లేదు. ఏఐబీపీ పథకంలో దేవాదుల నిర్మాణానికి చేసే వ్యయంలో 25 శాతం కేంద్రం నిధులను అందించనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రస్తుత అర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేంద్రం రూ.112 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది వరకు ఈ పథకం పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినందున పనులు వేగవంతం చేయాల్సి ఉంది. అందుకోసం ఈ ఏడాది 10 వేల ఎకరాల భూమి సేకరించాలని జిల్లా అధికారులకు లక్ష్యంగా పెట్టారు. ఇందులో ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన 3వేల ఎకరాల భూమి జూ¯ŒSలోగా సేకరించాలని అధికారులను అదేశించారు. అయితే ఆ మేరకు పనులు జరుగకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదుల ఫేజ్–3 పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్–3లో టన్నెల్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ప్రస్తుతం చేపట్టే పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. ఈ పనులవల్ల నష్టపోయినందున ప్రస్తుతం చేపట్టే పనులను అప్పగిస్తే ఇప్పటి వరకు పొందిన బిల్లుల మొత్తాన్ని రానున్న బిల్లుల్లో మినహాయించుకుంటామని సదరు ఏజెన్సీ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఎస్సారెస్పీ భూసేకరణతో పాటు దేవాదుల ఫేజ్–3 పనులను ప్రారంభించే విషయాన్ని మంత్రి హరీశ్‌రావు అధికారులతో చర్చిస్తారని తెలిసింది.
Advertisement