చింతలపూడి: రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ఒక్కోచోట ఒక్కో పద్దతి అనుసరిస్తున్నారని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వద్ద రైతులు రాస్తారోకోకు దిగారు. దెందులూరు నియోజకవర్గంలో ఇచ్చినట్లుగానే తమకు ఎకరాకు రూ.31 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాలువ తవ్వకం పనులను శుక్రవారం అడ్డుకున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎకరాకు 31 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వగా.. తమకు 12 లక్షలు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. అందరితో సమానంగా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తవ్వకం పనులను అడ్డుకుని ఏలూరు-చింతలపూడి రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు.
నష్టపరిహారంపై రైతుల రాస్తారోకో
Published Fri, May 20 2016 1:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM
Advertisement