భక్తుల కొంగు బంగారం.. ఇమాంషావలి దర్గా | Frill gold devotees .. Imansavali Dargah | Sakshi
Sakshi News home page

భక్తుల కొంగు బంగారం.. ఇమాంషావలి దర్గా

Published Wed, Sep 14 2016 1:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

భక్తుల కొంగు బంగారం.. ఇమాంషావలి దర్గా - Sakshi

భక్తుల కొంగు బంగారం.. ఇమాంషావలి దర్గా

  •  
  • రేపు ఈదులపూసపల్లిలో ఉర్సు
  • ముస్తాబైన దర్గా ఆవరణ
  • మహబూబాబాద్‌ రూరల్‌ :  కోరిన వారి కోర్కె లు తీర్చుతూ.. అనాథలకు ఆపన్నహస్తం అం దిస్తూ మహిమాన్వితంగా వెలుగొందుతోంది మండలంలోని ఈదులపూసపల్లి హజ్రత్‌ సయ్యద్‌ ఇమాంషావలి రహ్మతుల్లా అలై(దర్గా షరీఫ్‌). కులమతాలకతీతంగా ప్రజలందరూ ఇక్కడికి ఏటా తరలివచ్చి ఇమాంషావలి ఆశీ స్సులు పొందుతుంటారు. వివరాల్లోకి వెళితే.. సుమారు 350 ఏళ్ల క్రితం మండలంలోని ఈ దులపూసపల్లిలో ఇమాంషావలి దర్గా ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది బక్రీద్‌ పం డుగ రెండో రోజున ఇక్కడ ఉర్సును ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మహబూబాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, ఇత ర పట్టణాలు, జిల్లాల నుంచి కూడా కులమత భేదం లేకుండా ప్రజలు ఇమాం షావలి దరా ్గకు వచ్చి పూజలు చేస్తారు.భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గాలో కోరిన  కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం.   
     
    విద్యుత్‌ దీపాలతో అలంకరణ..
    ఈనెల 15వ తేదీన జరిగే ఉర్సుకు ఈదులపూసపల్లిలోని ఇమాంషావలి దర్గా ముస్తాబైంది. దర్గా ముతవల్లి ఎస్‌కె.అన్వర్‌ ఆధ్వర్యంలో ఆవరణకు రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అలాగే ఇందులోని ఇమాంషావలి సమాధి ప్రాంతాన్ని ముస్తాబు చేశారు, కాగా, బుధవారం మహబూబాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి తీసుకువచ్చే పవిత్ర గంధాన్ని ఈ దర్గాలో సమర్పించనున్నారు. అనంతరం వైభవంగా ఉర్సు జరుగనుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement